Site icon NTV Telugu

44 దేశాల్లో భారత్ స్ట్రెయిన్… అప్రమత్తమైన ప్రపంచం 

భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తికి కార‌ణ‌మైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది.  ప్ర‌పంచంలో 44 దేశాల్లో ఆ వేరియంట్ వ్యాప్తి చెందిన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కోన్న‌ది. మొదటి వేవ్ త‌రువాత ఉదాసీన‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల‌నే భార‌త్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని,  క‌రోనా మ్యూటేష‌న్‌లు ఏర్ప‌డ‌టానికి  ఉదాసీన‌తే కార‌ణ‌మని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ తెలిపింది.  ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ బి.1.617 వేరియంట్ అటు బ్రిట‌న్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది.  ఇండియా త‌రువాత అత్య‌దిక ఇండియా వేరియంట్ కేసులు అక్క‌డే న‌మోద‌వుతున్నాయి.  బ్రిట‌న్‌, ద‌క్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో క‌నిపించిన వేరియంట్ల కంటే భార‌త్ వేరియంట్ మ‌రింత వేగంగా విస్త‌రిస్తుండ‌టంతో ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ల జాబితాలో భార‌త్ వేరియంట్‌ను చేర్చారు.  

Exit mobile version