Site icon NTV Telugu

Canada: కెనడాలో దారుణం.. భారత సంతతి మహిళ హత్య

121

121

కెనడాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన అమన్‌ప్రీత్ అనే మహిళ (27) దారుణ హత్యకు గురైంది. లింకన్‌లోని ఒక పార్కులో అమన్‌ప్రీత్ సైని మృతదేహం లభ్యమైంది. గాయాలతో మృతదేహం లభ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు భారతదేశానికి పారిపోయాడని చెప్పారు.

ఇది కూడా చదవండి: Prashant Kishor: బీహార్ ఎన్నికల వేళ అసదుద్దీన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సలహా

అమన్ ప్రీత్ సైనీ బ్రాంప్టన్‌లో నివాసం ఉంటుంది. అక్టోబర్ 21న లింకన్‌లోని ఒక పార్కులో సైని మృతదేహం లభ్యమైంది. అయితే ఈ హత్యలో మన్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు పంజాబ్‌కు చెందిన వాసిగా గుర్తించారు. తాజాగా అతడికి సంబంధించిన చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. అతడి సమాచారం తెలియజేయాలని కోరారు. అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తున్నట్లు పేర్కొ్న్నారు. అమన్‌ప్రీత్ సైని మృతదేహం దొరికిన కొద్దిసేపటికే మన్‌ప్రీత్ సింగ్ దేశం విడిచి పారిపోయాడని.. దర్యాప్తు సాగుతోందని నయాగరా ప్రాంతీయ పోలీసు సర్వీస్ అధికారిక ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగానే చెప్పారు. ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Gold Rate Today: భారీగా పడిపోతున్న పసిడి ధరలు.. నేడు బంగారంపై 820, వెండిపై 4 వేలు ఢమాల్!

Exit mobile version