Indian-origin Suella Braverman appointed UK Home Secretary: యూకే కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న లిజ్ ట్రస్, కొత్తగా యూకే హోం సెక్రటరీగా భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రవర్‌మన్‌ను నియమించారు. లిజ్ ట్రస్ గెలిచిన తర్వాత ఆ పదవిలో ఉన్న ప్రతీ పటేల్ స్థానంలో సుయెల్లా బ్రవర్‌మన్‌ను ఈ బాధ్యతలను తీసుకున్నారు. ఈమె పార్లమెంట్ లో ధమ్మపదపై ప్రమాణం చేసి బాధ్యతలను చేపట్టారు.
42 ఏళ్ల సుయెల్లా బ్రవర్‌మన్ ఆగ్నేయ ఇంగ్లండ్ లోని ఫారెహామ్‌కు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అంతకు ముందు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాయాంలో అటార్నీ జనరల్ గా పనిచేశారు. 2015లో ఫారెహామ్‌కు కన్జర్వేటివ్ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. సుయెల్లా బ్రవర్‌మాన్ 1980లో జన్మించారు. ఆమె తల్లి ఉమా తమిళనాడుకు చెందిన హిందూ కాగా.. తండ్రి క్రిస్టీ ఫెర్నాండెస్. 1960లో ఫెర్నాండెస్ 1960లో కెన్యా నుంచి యూకేకి వలస వెళ్లగా.. తల్లి ఉమా మారిషస్ నుంచి యూకేకు వలస వెళ్లారు.
Read Also: Wife Killed Husband: ఫోన్ లో మాట్లాడుతుందని మందలించిన భర్త.. గొంతు నులిమి హత్య చేసిన భార్య
2018లో రేల్ బ్రమర్ మాన్ ను వివాహం చేసుకుంది. బ్రావర్ మాన్ భైద్ధమతాన్ని ఆచరిస్తున్నారు. తాజాగా ఆమెప్రమాణ స్వీకారం సమయంలో కూడా బౌద్ధ గ్రంథం ‘‘ ధమ్మపద’’పై ప్రమాణం చేస్తూ బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు యూకే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టారు. యూకేకు ప్రధాన మంత్రిగా పనిచేసిన మూడో మహిళగా రికార్డు సృష్టించారు. అంతకు ముందు మార్గరేట్ థాచర్, థెరిస్సా మేలు మాత్రమే యూకే ప్రధానులుగా పనిచేశారు. భారత సంతతి వ్యక్తి రిషి సునక్ 20 వేల ఓట్ల తేడాతో లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయారు.
