2 Indian-origin men shot dead In canada: కెనడాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు మరణించారు. పదిరోజుల క్రితం ఎయిరిండియా విమానం బాంబు దాడి కేసులు నిర్ధోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా అదే విధంగా మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. కెనడా బ్రిటీష్ కొలంబియాలోని విస్లర్ లో ఆదివారం ఈ కాల్పులు జరిగాయి. మోనిందర్ ధాలివాల్, సతీండేరా గిల్ హత్యకు గురయ్యారు.
గతంలో రిపుదమన్ సింగ్ పబ్లిక్ ప్లేస్ లో తన కారులో కూర్చుని ఉన్న సమయంలో దుండగులు కాల్చి చంపారు. తాజాగా జరిగిన కాల్పుల్లో కూడా ఇదే విధంగా ఇద్దరు హత్యకు గురయ్యారు. మోనిందర్, సతీండేరా గిల్ కారులో కూర్చుని ఉన్న సమయంలో వీరిద్దరిని దుండగులు కాల్చిచంపారు. అయితే గతంలో వాంకోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన జాబితాలో మోనిందర్ ధాలీవాల్.. ఆయన సోదరుడు బరిందర్ ధాలివాల్ గ్యాంగ్‌స్టర్లు జాబితాలో ఉన్నారు. ఈ హత్యల్నిన్ని గ్యాంస్ వార్ కింద పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also:CM KCR Delhi Visit: ఢిల్లీలో కేసీఆర్.. రేపు రాష్ట్రపతితో భేటీ.. అమిత్‌షాతో సమావేశం..
పదిరోజుల క్రితం 1985 ఎయిరిండియా విమానం బాంబింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ ను దుండగులు హత్య చేశారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోనే ఈ హత్య కూడా జరిగింది. కారులో కూర్చుని ఉన్న సమయంలో రిపుదమన్ సింగ్ దగ్గర నుంచి కాల్పులు జరిగాయి. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. టొరంటో నుంచి ఇండియా వస్తున్న ఎయిరిండియా విమానం బాంబుదాడిలో ఐర్లాండ్ సమీపంలోని అట్లాంటిస్ సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బందితో సహా 329 మంది మరణించారు.