Site icon NTV Telugu

Australia: ఘోరం.. రైలు ఢీకొని భారతీయ టెకీ, కుమార్తె మృతి

Australia

Australia

ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని భారతీయ టెకీ (40) ఆనంద్ రన్వాల్, అతని కుమార్తె మృతిచెందారు. మరో కుమార్తె గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని కార్ల్‌టన్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

ఆనంద్ తన కుటుంబంతో స్టేషన్‌లోని లిఫ్ట్‌ నుంచి బయటకు వస్తుండగా ప్రాం ట్రాక్‌పైకి పడింది. తన కవల కుమార్తెలను కాపాడేందుకు ట్రాక్‌లపైకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎదురుగా వస్తున్న రైలు ఢీకొని కవలల్లో ఒకరైన హినాల్ మృతి చెందగా.. మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఇది కూడా చదవండి: Budget 2024: రైల్వేలో సీనియర్ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్ ఉండే ఛాన్స్!

ఆనంద్ రన్వాల్‌కు భార్య పూనమ్ రన్వాల్, కవల కుమార్తెలు ఉన్నారు. ఆనంద్ సిడ్నీలోని ఆర్థిక సేవల సంస్థ వెస్ట్‌పాక్‌లో ఐటీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించాడు. అక్టోబర్ 2023లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. జూలై 21 ఆదివారం మధ్యాహ్నం కుటుంబం స్టేషన్‌లోని లిఫ్ట్‌ నుంచి బయటకు వస్తుండగా ప్రాం రైలు పట్టాలపైకి వెళ్లి బోల్తా పడింది. ఆనంద్ తన కుమార్తెలను రక్షించేందుకు పట్టాలపైకి దూకాడు. అయితే అతని కుమార్తెలలో ఒకరైన హినాల్ ఎదురుగా వస్తున్న రైలు ఢీకొని మరణించింది. ఆనంద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడిందని డైలీ మెయిల్ నివేదించింది. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీ, సాక్షుల కథనాలతో విచారణ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: iQOO Z9s: అతి త్వరలో బడ్జెట్ ఫ్రెండ్లీ లో సరికొత్త మొబైల్ లాంచ్..

Exit mobile version