Vietnam: వియత్నాం రాజధాని హనోయ్‌లో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. 31 ఏళ్ల భారతీయ వ్యక్తి తన మలద్వారంలోకి బతికి ఉన్న ఈల్‌ని చొప్పించుకున్నాడు. దీంతో అతను తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. జూలై 27న, ఆ వ్యక్తి విపరీతమైన నొప్పితో ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్య సాయం అందించారు. రోగి ఉదయాన్ని ఈల్‌ని చొప్పించుకున్నాడని డాక్టర్లు చెప్పారు. ఈల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, రోగి పెద్దపేగు, పురీషనాళాన్ని కొరికి, ఉదర కుహరంలోకి ప్రవేశించింది.
Read Also: Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్
ఎంఆర్ఐ, ఎక్స్ రే తీయగా, రోగి పొత్తికడుపులో ఈల్ ఉన్నట్లు గుర్తించారు. ముందుగా మలద్వారం ద్వార ఈల్‌ని తీసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, నిమ్మకాయను కూడా చొప్పించుకున్నట్లు తేలింది. దీంతో వైద్యలు వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ చేశారు. శస్త్రచికిత్స సమయంలో రోగి కడుపులో 25 అంగుళాల పొడవు, 4 అంగుళాల వ్యాసం ఉన్న ఈల్‌ని బయటకు తీశారు. ఈల్, నిమ్మకాయ విజయవంతంగా తొలగించబడినట్లు వైద్యులు వెల్లడించారు. ఈల్స్ చాలా కాలం పాటు వాయురహిత పరిస్థితుల్లో జీవించగలవు మరియు జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా కాటు వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని వైద్యులు చెప్పారు.