ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా సాగుతోంది.. ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం సృష్టిస్తోంది.. పోలాండ్ సరిహద్దు సమీపంలోని యవరీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. మిలటరీ ట్రైనింగ్ క్యాంపుపై మిస్సైల్‌లో దాడులకు పూనుకుంది.. రష్యా దాడుల్లో తాజాగా 35 మంది మృతిచెందగా.. 134 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇక, మరో మేయర్‌ను కూడా కిడ్నాప్ చేసింది రష్యా సైన్యం, తాజాగా మెలిటోపోల్ మేయర్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.. దీంతో ఇప్పటి వరకు కిడ్నాప్‌నకు గురైన మేయర్ల సంఖ్య రెండుకు చేరింది. ఉక్రెయిన్ పశ్చిమ భాగానికి కూడా రష్యా సైనిక చర్యలు విస్తరిస్తున్నాయి.. ఇవనోవ్ ఫ్రాంకోవిస్క్ మిలటరీ ఎయిర్‌బేస్‌పై క్షిపణులతో దాడులు చేశారని.. ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ దాడుల్లో లుట్స్క్ ఎయిర్ పోర్టు బాగా దెబ్బతింది. ఉక్రెయిన్‌లోని సాంస్కృతిక కేంద్రమైన ల్వీవ్ నగరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఉంది. వేలాది మంది ఉక్రెయిన్లు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ల్వీవ్‌పై కూడా దాడులు జరగడంతో మరో సురక్షిత స్థానం కోసం పరుగులు తీస్తున్నారని ఉక్రెయిన్ మిలటరీ వెల్లడించింది.. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. కుక్క నోట్లో బాలుడి తల..
క్రమంగా ఉక్రెయిన్‌లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత రాయాబార కార్యాలయాన్ని తాత్కాలికంగా ఉక్రెయిన్ నుంచి తరలించాలని నిర్ణయానికి వచ్చింది.. భారత రాయబార కార్యాలయాన్ని ఉక్రెయిన్ నుంచి పొరుగున ఉన్న పోలాండ్‌కి తరలించినట్లు కేంద్రం పేర్కొంది.. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలపై దాడుల నేపథ్యం.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరియు అనేక ఇతర ప్రముఖ నగరాలపై రష్యా దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత పభ్రుత్వం తెలిపింది.
