Site icon NTV Telugu

Iran-India: తక్షణమే టెహ్రాన్ ఖాళీ చేయండి.. పౌరులకు భారత్ పిలుపు

India

India

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు చేదాటుతున్నాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇక మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. భారీ పేలుళ్లు, వైమానిక దాడులు జరిగాయని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి: Gold Rates: ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన పసిడి ధరలు.. రూ. 1140 తగ్గిన తులం గోల్డ్ ధర

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉధృతం అవుతున్న వేళ భారత్ అప్రమత్తం అయింది. తక్షణమే పౌరులు టెహ్రాన్ ఖాళీ చేయాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించే అవకాశం ఉందని.. తక్షణమే భారత సంతతికి చెందిన వ్యక్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. సొంత వనరులు ఉపయోగించుకుని వెళ్లిపోవాలని తెలిపింది.

ఇది కూడా చదవండి:SKN : ‘జాతిని..’ టీ-షర్ట్ వేసిన SKN.. వెనకున్న నిజం ఏంటో తెలుసా?

ఇక అత్యవసర పరిస్థితుల్లో భారతీయ పౌరులందరూ వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా కోరింది. ఎలాంటి అవసరత వచ్చినా ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరింది. +989010144557,+989128109115, +989128109109 నెంబర్లకు కాల్ చేయాలని తెలిపింది.

Exit mobile version