Donald Trump: భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారీఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని కూడా చెప్పారు. తాజాగా రష్యా, భారత్‌లను ఉద్దేశిస్తూ ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదని గురువారం ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. కానీ, వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని తెలిపారు. తాము, భారత్ తో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నాం.. ఎందుకంటే అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇక, రష్యా, యూఎస్‌లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Read Also: YS Jagan Nellore Tour: నెల్లూరు చేరుకున్న జగన్.. హరిత హోటల్ దగ్గర ఉద్రిక్తత..
తమతో వాషింగ్టన్ గేమ్ ఆడుతుందని, అది యుద్ధానికి దారితీయొచ్చని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మద్వెదేవ్ వ్యాఖ్యాలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయన ఇంకా అధ్యక్షుడిననే భ్రమలో ఉన్నారని సెటైర్లు వేశారు. దిమిత్రి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని హెచ్చరించారు. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీగా టారీఫ్స్ విధిస్తామని భారత్‌తో సహా పలు దేశాలను ఇటీవల అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇదే కారణాన్ని చూపిస్తూ.. భారత దిగుమతులపై 25శాతం పన్నులతో పాటు పెనాల్టీలు కూడా విధించింది. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ఆరోపించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రాబోతుంది. రష్యా నుంచి దిగుమతులతో యూఎస్ పెనాల్టీలకు గురైన తొలి దేశం భారత్. ఈ టారీఫ్స్ పై భారత్ స్పందిస్తూ.. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది.
