Site icon NTV Telugu

India-Iran: 48 గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక

India1

India1

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం అవుతుందని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండాలని.. సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని ఇరాన్‌లోని పౌరులకు భారత్ విజ్ఞప్తి చేసింది. భారతీయులంతా ఇంట్లోనే ఉండాలని… ముఖ్యంగా అధికారిక ఆదేశాలతో మాత్రమే రహదారి ప్రయాణాలు చేపట్టాలని.. రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సలహా ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

ఇరాన్ విషయంలో ట్రంప్ విధించిన గడువు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం సాయంత్రం ఒక సలహా జారీ చేసింది. భారత పౌరులు కనీసం 48 గంటల పాటు తాము ఉన్న ప్రదేశాలలోనే ఉండాలని కోరింది. ముఖ్యంగా సైనిక, విద్యుత్ కేంద్రాల వంటి సున్నితమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: JD Vance: బంతి ఇరాన్‌లో కోర్టులో ఉంది.. చర్చలపై జేడీ వాన్స్ కీలక ప్రకటన

బహుళ అంతస్తుల భవనాలపై ఉండొద్దని తెలిపింది. ఇంట్లో ఉంటేనే క్షేమం అని పేర్కొంది. రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హోటళ్లలో బస చేస్తున్న వారు లోపలే ఉండాలని.. రాయబార కార్యాలయ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరపాలని ప్రత్యేకంగా ఆదేశించింది. భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితిలో ఏవైనా మార్పులు ఉంటే అధికారిక సమాచారాన్ని నిశితంగా గమనించాలని రాయబార కార్యాలయం కోరింది.

Exit mobile version