Site icon NTV Telugu

UK Violence: యూకేలో హింస.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Uk

Uk

UK Violence: బ్రిటన్ హింసతో అట్టుడుకుతోంది. యూకే వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముగ్గురు బ్రిటన్ జాతీయులైన పిల్లలపై కత్తిపోట్ల దాడి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దీంతో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా అక్కడి యూకే వాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో యూకేకి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా సంస్థల సలహాలను పాటించాలని భారత్ మంగళవారం కోరింది.

Read Also: TG Governor: జయశంకర్‌కు నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

గతవారం బ్రిటన్ లోని వాయువ్య పట్టనమైన సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు బాలికలపై కత్తిపోట్ల దాడి జరిగింది. ఈ దాడిలో వారు ముగ్గురు మరణించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. వలస వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక ఆందోళనకారులు నిరసనలు తెలపడం ప్రారంభించారు.

లండన్‌లోని భారత హైకమిషన్ (దౌత్యకార్యాలయం) “పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారతదేశం నుండి వచ్చే సందర్శకులు UKలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మరియు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించబడింది” అని హైకమిషన్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొంది.

Exit mobile version