IMF reduced India’s economic growth: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటును తగ్గించింది. 2022లో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను మంగళవారం 7.4 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 2022 ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఐఎంఎఫ్ భారతదేశ ఎకనామిక్ గ్రోత్ రేట్ ను 7.4గా ఉండవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో 2022 వృద్ధిరేటు 8.2 శాతంగా ఉంటుందని అంచానా వేసింది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత వృద్ధిరేటును క్రమంగా తగ్గిస్తూ వస్తోంది ఐఎంఎఫ్. అయినా కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో టాప్ పొజిషన్ లో ఉంది భారత్.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 8.7 శాతం వృద్ధిరేటను సాధించింది. అయితే మంగళవారం విడుదల చేసి వార్షిక ప్రపంచ ఎకనామిక్ ఔట్‌లుక్ లో భారత్ 2022లో 6.8 శాతం గ్రోత్ ను సాధిస్తుందని వెల్లడించింది. 2022లో ప్రపంచ మొత్తం వృద్ధిరేటును 3.2 శాతానికి, 2023లో 2.7 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచానా వేసింది. గతేడాది ప్రపంచ వృద్ధి 6.0 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
Read Also: Allu Aravind: చిరంజీవిని మా ఇంటి అల్లుడిగా చేసుకోవడానికి కారణం ఆమె..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచదేశాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇది 2023లో ప్రపంచ మాంద్యానికి దారి తీసే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. ఇప్పటికే చైనాలో రియల్ఎస్టేట్ రంగం కుదేలు అయింది. తరుచూ కోవిడ్ లాక్ డౌన్లతో ఆ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అన్ని దేశాలు ద్రవ్యోల్భన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. చైనా మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఉండటంతో అక్కడి పరిణామాలు ప్రపంచ దేశాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.
యూఎస్ఏలో ద్రవ్య, ఆర్థిక పరిస్థితులను కఠినతరం చేయడం వల్ల వచ్చే ఏడాది వృద్ధిలో 1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు అంచనాలు 3.2 శాతంగా ఉంటాయని.. ఇది 2021లో 8.1 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే చాలా తక్కువ అని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిర పరిచింది. యూరప్ తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కొంటోంది.
