దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లుగా తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో బలమైన గాలులు, వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Crude Oil: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ వేళ.. భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు
ఈరోజు ఢిల్లీ నగరంలో భారీ వర్షం, ఉరుములతో కూడిన తుఫాను వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాయంత్రం గాలి వేగం మరింత పెరిగే అవకాశం ఉందని.. గురువారం నుంచి వాతావరణం మెరుగుపడుతుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?
