Site icon NTV Telugu

Sunday Special Dish: ఆ హోటల్‌లో ఆర్డర్‌ ఇస్తే నాలుగేళ్లు ఆగాలి.. స్పెషల్ డిష్ తినాలంటే ఎదురు చూడక తప్పదు

Sunday Special Dish

Sunday Special Dish

Sunday Special Dish: ఒక హోటల్‌కి వెళ్లి తినడానికి ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తరవాత నిముషాల వ్యవధిలో ఆ ఐటెం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆర్డర్ ఇచ్చిన ఐటెం కోసం గంటల తరబడి ఎదురు చూడటమన్నది చాలా అరుదుగా చూస్తుంటాం. అదే హోటల్‌ నుంచి మనకు కావల్సింది ఇంటి దగ్గరకే రావాలనుకుంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. అది కూడా గంటల వ్యవధిలో మనముందుంటుంది. ఇక మరికొన్ని ప్రముఖ హోటళ్లలో అయితే ఆదివారం ప్రైమ్ టైమ్ ఫుడ్ బుకింగ్ కావాలంటే ఒకట్రెండు రోజుల ముందు టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు తినాలనుకున్న స్పెషల్‌ ఫుడ్‌ ఐటమ్‌ కోసం గంట రెండు కాలు.. ఏకంగా నాలుగేళ్లు ఎదురు చూడటమంటే నిజంగా విశేషమే కదా.. అటువంటి హోటల్‌ గురించి తెలుసుకుందాం..

Read also

బ్రిస్టల్ లోని ఓ ప్రఖ్యాత పబ్‌లో ప్రతేకమైన ఆదివారం స్పెషల్ డిష్ తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే. ఈరోజు బుక్ చేసుకుని నాలుగేళ్లపాటు ఎదురు చూస్తే చాలు ఆ వంటకం రుచి చూసే భాగ్యం కలుగుతుంది. అదే బ్రిస్టల్ లోని ది బ్యాంక్ టావెర్న్ పబ్. ఈ పబ్‌లో ఆర్డర్ చేయాలంటే ఓపిక ఉండాలి. అందులోనూ ఆ హోటల్ ప్రత్యేకం తినాలంటే బుకింగ్ టైమ్ నాలుగేళ్లు పడుతుంది. అంత పొడవాటి వెయిటింగ్ లిస్టు ఉన్న హోటల్ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఆ హోటల్లో సండే స్పెషల్ రోస్ట్ బుక్ చేసుకుంటే మన టైమ్ వచ్చేసరికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. అన్నేళ్ల పాటు ఆగాలంటే నిజంగానే ఓపికపట్టడంలో పీ.హెచ్.డి చేనుండాలి. అందులోనూ భోజనప్రియులు అంత కాలం ఆగడమంటే చాలా గొప్ప విషయం. ది బ్యాంక్ టావెర్న్ హోటల్ వడ్డించే సండే రోస్టులో రుచికరమైన ప్రత్యేక వంటకాల ఉంటాయి. నోరూరించే ఈ వంటకానికి 2018లో బ్రిస్టల్ గుడ్‌ఫుడ్ అవార్డుల్లో ఉత్తమ సండే లంచ్‌ అవార్డుతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అయితే కరోనా సమయానికి ముందు ఈ హోటల్లో ఆర్డర్లన్నీ సమయానికే డెలివరీ ఇచ్చేవారు. కానీ లాక్‌డౌన్‌ సమయంలో పబ్ మూసివేసి ఉండటంతో ఆ సమయంలో వచ్చిన ఆర్డర్లన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్న పబ్‌వారు ప్రస్తుతానికి నాలుగేళ్లు వెనుకబడ్డారట. దీంతో ఈ హోటల్లో ఇప్పుడు సండే రోస్ట్ ఆర్డర్ చేసేవారు నాలుగేళ్లు వేయిట్ చేయక తప్పదు. అందుకే ఈ రెస్టారెంట్ వారు ప్రస్తుతానికైతే బుకింగ్ లను పూర్తిగా నిలిపివేశారు. ఆర్డర్లు అన్నీ పూర్తయిన తరువాత కొత్త ఆర్డర్లను తీసుకోవడం ప్రారంభిస్తారని నిర్వహకులు చెబుతున్నారు.

Exit mobile version