NTV Telugu Site icon

US: అమెరికాను హడలెత్తించిన ‘హెలెన్‌’ తుఫాన్ .. అంధకారంలో 30 లక్షల మంది!

Us

Us

హెలెన్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను బెంబేలెత్తించింది. అతి తీవ్రమైన తుఫాన్ కారణంగా భారీ విధ్వంసం సృష్టించింది. తుఫాన్ ధాటికి ఇప్పటివరకు 52 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రకృతి విపత్తు కారణంగా ఆగ్నేయ అమెరికాలో బిలియన్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు 30 లక్షల మంది ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. అనేక మందికి వరద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Special FDs Offering: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వచ్చే స్కీమ్స్ ఇవే..!

ఫ్లోరిడా, జార్జియా, నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి- 4 ‘హెలెన్‌’ తీవ్ర ప్రభావం చూపింది. ఫ్లోరిడాలో తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. జార్జియా, సౌత్‌ కరోలినా, నార్త్‌ కరోలినా, టెనస్సీ గుండా సాగిన హరికేన్‌ ధాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని దేశాధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Iran: ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఇరాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా చీఫ్ హత్యపై నిరసన..