Site icon NTV Telugu

Layoffs at Citigroup: మొన్ననే విలీనం పూర్తి.. ఇప్పుడు భారీగా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం

Citigroup

Citigroup

Layoffs at Citigroup: 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిటీ బ్యాంక్‌.. ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన యాక్సిక్‌లో విలీనమైంది.. ఈ నెల 1వ తేదీతో విలీన ప్రక్రియను పూర్తి చేసింది.. ఈ సందర్భంగా సిటీ బ్యాంక్‌ ఖాతాదారులకు కీలక సూచనలు కూడా చేశారు.. అయితే, అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌.. ఇప్పుడు వందలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధం అయ్యింది.. సంస్థలోని ఆపరేషన్స్‌, టెక్నాలజీ ఆర్గనైజేషన్‌, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను భారీ సంఖ్యలో ఇంటికి పంపించేందుకు సిద్ధమైందని బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది.. అయితే, ఇది కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 2,40,000 మంది ఉద్యోగుల్లో ఒక శాతం మాత్రమేనని పేర్కొంది ఆ సంస్థ.

ఇక, దీనిపై స్పందించిన సిటీ గ్రూప్‌.. ఉద్యోగుల తొలగింపు అనేది సర్వసాధారణమైన విషయం.. తమ వార్షిక ప్రణాళికలో భాగంగా ఇది జరిగే ప్రక్రియగా చెబుతోంది.. ఒక్కో విభాగంలో ఒక్కో కారణంతో కొంత వరకు ఉద్యోగుల తొలగింపు ఉంటుందని పేర్కొంది.. మరోవైపు.. ఇప్పటికే జేపీ మోర్గాన్‌ సంస్థ గతవారం వందల సంఖ్యలో ఉద్యోగులను బైబై చెప్పేసింది.. జనవరి నెలలో గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ దాదాపు 3200 మంది ఉద్యోగులను తొలగించింది.. గూగుల్, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి సంస్థలు ఉద్యోగులను తొలగించిన విషయం విదితమే.. సిటీ టెక్నాలజీ విభాగంలో దాని అంతర్లీన మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా బిలియన్లు ఖర్చు చేసింది సిటీ గ్రూప్. ఈ పెట్టుబడులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జేన్ ఫ్రేజర్ ప్రకారం, చివరికి బ్యాంక్ మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనుమతిస్తుంది.

సిటీ గ్రూప్ యొక్క తనఖా విభాగాన్ని ప్రభావితం చేసిన తాజా చర్య, పెరుగుతున్న ధరలు మరియు తనఖా రేట్ల వేగవంతమైన పెరుగుదల మధ్య తనఖా డిమాండ్ పడిపోవడానికి కారణమని చెప్పవచ్చు. గ్రూప్ ఇప్పటికే గత సంవత్సరం డజన్ల కొద్దీ సిబ్బందిని తొలగించింది. మేం మా వ్యూహానికి వ్యతిరేకంగా అమలు చేయడానికి చురుకుగా నియమించుకుంటున్నాం. కానీ, మేం ఉన్న పర్యావరణం యొక్క వెలుగులో అది అర్ధమయ్యే చోట మేం తిరిగి వేగం చేస్తున్నాం అని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ జనవరిలో చెప్పారు. “మేము నిరంతరం ప్రతిభను మెరుగుపరుచుకుంటాము మరియు సరైన పాత్రలలో సరైన వ్యక్తులను పొందామని నిర్ధారించుకుంటాము మరియు పునర్నిర్మాణానికి అవసరమైన చోట, మేము అలాగే చేస్తాం అని పేర్కొన్నారు.. మొత్తంగా అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌ తన కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధం అయ్యింది.

Exit mobile version