Site icon NTV Telugu

Corona : చైనాలో మళ్లీ రక్కసి బీభత్సం.. 50 వేల కేసులు..

Huge Carona Cases in China and Hongkong.

మొన్నటి వరకు యావత్త ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదువుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 56వేల కరోనా కొత్త కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది.ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అంతేకాకండా హాంకాంగ్‌లోనూ పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనాకు కళ్లెం వేసేందుకు డైనమిక్ జీరో కొవిడ్ లక్ష్యంతో ముందుకెళ్తామని, త్వరలోనే దానిని చేరుకుంటామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు తెలిపారు.

హాంకాంగ్‌లో గత నెల రోజుల్లో 200 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఇటీవల మొదలైన వేవ్ కారణంగా ఒక్క హాంకాంగ్‌లోనే ఏకంగా 10 లక్షల కేసులు నమోదుకావడం అధికారుల్లో గుబులు రేపింది. అయితే కరోనాను నియంత్రించేందుకు అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

https://ntvtelugu.com/ts-tet-2022-online-applications-from-today/
Exit mobile version