Pakistan: పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్‌కి గురైంది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాక్ రైల్వేకి చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేశారు. ఈ రైలు బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రైన్‌పై దాడి చేసిన బీఎల్ఏ 450 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు.
రైలు ఎలా హైజాక్ చేయబడింది..?
హైజాక్ గురించి పాక్ మీడియా కానీ, అక్కడి అధికారులు కానీ వివరాలను వెల్లడించడం లేదు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, బీఎల్ఏ, పాక్ ఆర్మీకి మధ్య విపరీతమైన ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రైలులో చాలా మంది పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సెలవులపై పంజాబ్ వెళ్తున్నారు. వీరంతా ఇప్పుడు బీఎల్ఏ బందీలుగా మారారు. 100కి పైగా పాక్ ఆర్మీ సైనికులు బీఎల్ఏ చెరలో ఉన్నారు. పాక్ ఆర్మీ ఏదైనా ఆపరేషన్ ప్రారంభిస్తే వీరందర్ని చంపుతామని హెచ్చరించింది.
జాఫర్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం 1.00 ప్రాంతంలో రూరల్ సిబి జిల్లాలో సాయుధ బీఎల్ఏ ఫైలర్లు ఆపారు. ట్రైన్ ఆగాల్సిన స్టేషన్‌కి సమీపంలో ఈ ఘటన జరిగింది. బీఎల్ఏ ఫైటర్లు రైల్వే ట్రాక్‌పై బాంబు దాడి చేశారని, డ్రైవర్‌ని గాయపరిచిన తర్వాత సిబీలో రైలుని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Sai Pallavi : చీరకట్టులో సాయిపల్లవి డ్యాన్స్.. ఎంత ముచ్చటగా ఉందో
సిబి జిల్లా బలూచిస్తాన్‌లో మారుమూల పర్వత ప్రాంతాలతో కూడి ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్-ఇరాన్ సరిహద్దుల ప్రాంతంలో ఉంది. రైలు క్వెట్టా నుంచి పెషావర్‌కి ఉదయం 9.00 గంటలకు బయలుదేరింది. హైజార్ జరిగినప్పుడు పెహ్రో కున్రి-గడాలర్ మధ్య ప్రయాణిస్తోంది. క్వెట్టా నుంచి పెషావర్‌కి 30 గంటల ప్రయాణం ఉంటుంది.
9 బోగీలు కలిగిన రైలులో దాదాపుగా 500 మంది ప్రయాణికులను తీసుకెళ్తుండగా, టన్నెల్ నెంబర్ 8 వద్ద ఆపినట్లు రైల్వే కంట్రోలర్ కాషిఫ్ ధృవీకరించారు. ఈ ప్రాంతంలో రైల్వే లైన్ వెంబడి మొత్తం 17 సొరంగాలు ఉన్నాయి. కఠినమైన భూభాగం, పర్వతాలు కావడంతో ఈ ప్రాంతంలో రైలు తరుచుగా నెమ్మదిగా వెళ్తుంది. ఇదే అదనుగా బీఎల్ఏ దాడి చేసి ట్రైన్‌ని అదుపులోకి తీసుకుంది.
నిజానికి 2024 నవంబర్ నెలలో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ ఆర్మీ జవాన్లను టార్గెట్ చేస్తూ ఈ దాడిని బీఎల్ఏ నిర్వహించింది. ఈ ఘటనలో 60 మంది మరణించారు. అప్పటి నుంచి క్వెట్టా-పెషావర్ మధ్య రైలుని రద్దు చేశారు. ఇటీవలే మళ్లీ సర్వీస్‌ని పునరుద్ధరించారు. ప్రారంభించిన కొన్ని రోజులకే ట్రైన్ హైజాక్‌కి గురైంది.