Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- మక్కా రక్షణ కూటమి అమల్లోకి వచ్చినట్లు పాక్ ప్రకటన
- అయినా వెనక్కి తగ్గని హౌతీలు
- సౌదీపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi-Houthi War: సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ‘‘మక్కా ఒప్పందం’’ అమలులోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్-టర్కీ దేశాలు తమ సైన్యాన్ని సౌదీకి రక్షణగా నిలపడం ప్రారంభించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.
ఇదిలా ఉంటే, ఈ పరిణామం చోటుచేసుకున్న తర్వాత కూడా హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు తగ్గించలేదు. మరోసారి డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. సోమవారం నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాలపై దాడులు జరిగాయని, రెండు విమానాశ్రయలు దెబ్బతిన్నాయని, ముగ్గురు గాయపడ్డారని సౌదీ అరేబియా మంగళవారం చెప్పింది. సౌదీ చమురు సంస్థలు, విమానాశ్రయాలు మరియు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
సౌదీ అరేబియాకు పాకిస్తాన్, టర్కీలు అండగా నిలిచినా తగ్గేది లేదని హౌతీలు వరస దాడులతో స్పష్టం చేస్తున్నారు. యెమెన్ నుంచే డ్రోన్, క్షిపణి దాడులు చేయగల సామర్థ్యం హౌతీల వద్ద ఉంది. ప్రత్యేక కమాండ్ వ్యవస్థ ఉండటమే దీనికి కారణం. సౌదీ భద్రతలో పాకిస్తాన్ పాత్ర పెరిగినంత మాత్రాన దాని సైన్యం యెమెన్‌లో హౌతీలతో నేరుగా తలపడే అవకాశాలు తక్కువే. దీంతో పాకిస్తాన్ సౌదీ రక్షణ విషయంలో అండగా నిలుస్తున్నప్పటికీ హౌతీలు తమ దాడుల్ని తగ్గించడం లేదు.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!