Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Hormuz Strait Crisis Us May Ease Iran Oil Sanctions Supplies Could Resume In 3 4 Days

Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..

Published Date :March 21, 2026 , 10:45 am
By Sudhakar Ravula
Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hormuz Strait Crisis: ఇరాన్‌-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ సమయంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హర్మూజ్‌ జలసంధి.. ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే హర్మూజ్‌ జలసంధి.. చాలా దేశాలు ఇంధన, గ్యాస్‌ కొరతకు కారణం అవుతుంది.. అయితే, హర్మూజ్‌ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో సరఫరాలకు అంతరాయం కలగడంతో చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌పై ఆంక్షలను సడలించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన చమురు సరఫరాలు సముద్రంలో నిలిచిపోవడంతో, వాటిని విడుదల చేస్తే 3 నుంచి 4 రోజుల్లో ఆసియా దేశాల ఓడరేవులకు చేరవచ్చని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ తెలిపారు.

అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా 30 రోజుల పాటు ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను సడలించింది. దీని వల్ల సముద్రంలో నిలిచిపోయిన ట్యాంకర్లు తిరిగి ప్రయాణం ప్రారంభించి, సరఫరాలను వేగవంతం చేసే అవకాశం ఉంది. అంతకుముందు, స్కాట్ బెస్సెంట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, సరఫరా అంతరాయాలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలక మార్గమైన హర్మూజ్‌ జలసంధి చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి సరఫరాలను పునరుద్ధరించడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అధిపతి ఫాతిహ్ బిరోల్ ప్రపంచం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశముందని హెచ్చరించారు. గల్ఫ్ దేశాల నుంచి సరఫరాలు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలల వరకు పట్టవచ్చని తెలిపారు. అంతేకాకుండా, సరఫరా సమస్యలు కొనసాగితే చమురు ధరలు బ్యారెల్‌కు 180 డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని గల్ఫ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. మొత్తానికి, హర్మూజ్‌ జలసంధి పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా మారుతున్నాయి. అమెరికా తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో చమురు ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • crude oil supply Asia
  • energy crisis global
  • global oil prices news
  • Hormuz Strait Crisis
  • Iran oil exports

తాజావార్తలు

  • Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..

  • Gold Rates: మగువలకు శుభవార్త.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా!

  • Singareni Coal Production: సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై యుద్ధ ప్రభావం.. అసలేమైందంటే..?

  • LPG Tankers Cross Strait of Hormuz: గుడ్‌న్యూస్.. హర్మూజ్ జలసంధి నుంచి రెండు భారతీయ గ్యాస్ నౌకల ప్రయాణం..!

  • Kunika Sadanand Marriage: 62 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అంటున్న సీనియర్‌ నటి..

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions