Site icon NTV Telugu

అక్క‌డి మ‌ట్టి చాలా రుచిగా ఉంటుంద‌ట‌… అందుకే దానిని…

వంట‌ల్లో మ‌సాలాలు ప‌డితే ఆ చుచి వేరుగా ఉంటుంది. ఇండియాలో మ‌సాలాలు ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు. ఒక్క ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లో మ‌సాలాలు వినియోగిస్తార‌నే సంగ‌తి తెలుసు. అయితే, ఇరాన్‌లోని హ‌ర్మూజ్ ఐలాండ్‌లో ప్ర‌జ‌లు మ‌ట్టిని మ‌సాలాలుగా వినియోగిస్తుంటారు. ఇది విన‌డానికి విచిత్రంగా ఉండొచ్చు. అక్క‌డి అనేక ర‌కాల ప‌ర్వ‌తాలు ఉన్నాయి. ఒక్కో ప‌ర్వ‌తం ఒక్కో రంగుతో ఉంటుంది. అంతేకాదు, ఆ ప‌ర్వ‌తాల నుంచి వ‌చ్చే మ‌ట్టి ఒక్కో రుచిని క‌లిగి ఉంటుంది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు అక్క‌డి ప‌ర్వ‌తాల నుంచి మ‌ట్టిని సేక‌రించి కూర‌ల్లో వినియోగిస్తారు. ఇందులో ఐర‌న్ తో పాటు 70 ర‌కాల ఖ‌నిజాలు ఉన్నాయ‌ని, ఆ ఖ‌నిజాలు మ‌ట్టిలో క‌లిసిపోయి రుచిక‌రంగా మారుతుంద‌ని స్థానికులు చెబుతున్నాయి.

Read: ప్ర‌పంచంలోనే అత్యంత వేగ‌వంత‌మైన విమానం… బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు…

Exit mobile version