Site icon NTV Telugu

వారికి గుడ్‌న్యూస్‌.. క్వారంటైన్ నిబంధ‌న ఎత్తివేత‌

క‌రోనా ఎంట్రీతో అన్ని దేశాలు ఆంక్ష‌ల బాట ప‌ట్టాయి.. ఇత‌ర ప్రాంతాలు, దేశాల నుంచి ఎవ‌రైనా వ‌చ్చారంటే.. అనుమానంగా చూడాల్సిన ప‌రిస్థితి.. అయితే, క్ర‌మంగా ఆ ప‌రిస్థితి పోయినా.. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంట్రీతో మ‌రోసారి చాలా దేశాలు క‌ఠిన ఆంక్ష‌లు విధించాయి.. అయితే, ఈ స‌మ‌యంలో విదేశీ ప్రయాణికులకు హాంగ్ కాంగ్ శుభ‌వార్త చెప్పింది.. హాంగ్ కాంగ్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది..

Read Also: నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత‌.. వ‌చ్చేవారం నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు..

కాగా, ఒమిక్రాన్ ఎంట్రీ త‌ర్వాత హాంగ్ కాంగ్ కట్టుదిట్టమైన ఆంక్ష‌లు అమ‌లు చేస్తూ వ‌చ్చింది.. ఈ క్రమంలోనే హాంగ్‌కాంగ్‌కు వెళ్లే విదేశీ, దేశీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఏ ప్ర‌యాణికుడైనా హాంగ్‌కాంగ్‌కు చేరుకున్నాడంటే.. మూడు వారాలు అంటే 21 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.. కానీ, ఆ నిబంధనను తాజా స‌వ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకుంది హాంగ్ కాంగ్.. కానీ, హాంగ్ కాంగ్ చేసుకున్న ప్రయాణికులు స్థానికంగా ఉన్న హోటళ్లలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండేలా నిబంధ‌న‌లు మార్చారు.. ఇక‌, ఆ క్వారంటైన్ పూర్తిచేసిన త‌ర్వాత మరో వారం రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉంటే స‌రిపోతుంద‌ని అధికారులు చెబుతున్నారు.. తాజాగా సవరించిన క్వారంటైన్ నిబంధ‌న‌లు మాత్రం వ‌చ్చే నెల అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి.. మ‌రోవైపు, క‌రోనా ఆంక్షల‌ను మాత్రం ఫిబ్రవరి 17 వరకు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది హాంగ్ కాంగ్..

Exit mobile version