Site icon NTV Telugu

Honduras: జైలులో నరమేధం.. గ్యాంగ్ వార్‌లో 46 మంది మహిళా ఖైదీల దారుణహత్య

Honduran

Honduran

Honduras: సెంట్రల్ అమెరికా దేశం హోండూరస్ లో దారుణం చోటు చేసుకుంది. మహిళా ఖైదీలు ఉండే ఓ జైలులో ముఠా ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డాయి. తుపాకీ, కొడవళ్లు, మండే కెమికల్స్ ఉపయోగించి దాడికి తెగబడ్డారు. దీంతో 46 మంది ఖైదీలను ముఠా సభ్యులు హతమర్చారు. ముందుగా తుపాకీతో కాల్చేసి, కొడవళ్లతో దాడి చేసి, ఆ తరువాత మండే ద్రవం పోసి కాల్చి చంపారు. మంగళవారం ఈ సంఘటన జరిగింది. హోండురాస్ రాజధానికి వాయువ్యంగా 30 మైళ్ల (50 కిలోమీటర్లు) దూరంలో ఉన్న తమరా పట్టణంలోని జైలు ఈ ఘటన జరిగింది.

Read Also: Uber Layoff: ఉబర్ నుంచి 200 మంది ఉద్యోగుల తొలగింపు..

ఇటీవల జరిగిన సంఘటల్లో అత్యంత దారుణమైన సంఘటనగా దీన్ని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. దేశ అధ్యక్షురాలు జయోమారా కాస్ట్రా ఈ ఘటనను భయకరమైన ఘటనగా అభివర్ణించారు. బారియో 18 సభ్యులు తమవారిని బెదిరించారని చనిపోయిన ఖైదీలకు చెందిన బంధువలు ఆరోపించారు. ఈ ఘటనతో జైలులో భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆయుధాలతో వ్యక్తులు ప్రత్యర్థి ముఠా సెల్ బ్లాక్ వద్దకు వెళ్లి తలుపులు మూసేసి వారిపై కాల్పులు జరిపారని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రణాళిక ప్రకారం దాడికి తెగబడినట్లు వారు తెలిపారు. మహిళా గార్డులు ఉన్నా కూడా వారి ఏం చేయలేక నిస్సాయకులుగా మిగిలారు.

ఈ దాడి అనంతరం అద్యక్షురాలు భద్రతా మంత్రి రామ్న్ సబిల్న్ ను తొలగించి ఆయన స్థానంలో జాతీయ పోలీస్ చీఫ్ గా ఉన్న గుస్తావో సాంచెజ్ ను నియమించారు. బారియో 18 ముఠా సభ్యులుగా గుర్తించబడిన ఖైదీలు జైలులోకి తుపాకులు మరియు కొడవళ్లను ఎలా సంపాదించారు, ప్రక్కనే ఉన్న సెల్ బ్లాక్‌లోకి స్వేచ్ఛగా ఎలా వెళ్లగలిగారనేది అనుమానాస్పదంగా మారింది. దాడిని సులభతరం చేసేందుకు ముఠా సెల్ బ్లాక్‌కు తలుపులు తెరిచి ఉంచినట్లు ప్రాథమిక నివేదికలు సూచించాయి. 18 పిస్టల్స్, ఒక అసాల్ట్ రైఫిల్, రెండు మెషిన్ పిస్టల్స్ మరియు రెండు గ్రెనేడ్లు జైలులో దొరికాయి. ఈ ఘటన 2017లో గ్వాటెమాలాలోని మహిళా జైలులో జరిగిన అగ్నిప్రమాదం ఘటనను మించిపోయింది. ఆ సమయంలో 41 మంది మరణించారు.

Exit mobile version