NTV Telugu Site icon

Michelle Trachtenberg: హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ అనుమానాస్పద మృతి

Michelletrachtenberg

Michelletrachtenberg

హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్(39) అనుమానాస్పద స్థతిలో మృతిచెందారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. మూడేళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. ‘‘బఫీ ది వాంపైర్ స్లేయర్’’, ‘‘గాసిప్ గర్ల్’’ వంటి సిరీస్‌ల్లో పాత్రలకు మంచి పేరు వచ్చింది. ముద్దుగా ఆమెను బఫీ అని అభిమానులు పిలుచుకుంటారు. బుధవారం ఉదయం అతి చిన్న వయసులో మిచెల్ మరణించినట్లు యూఎస్ మీడియా పేర్కొంది.

ఇది కూడా చదవండి: Thandel : బుజ్జితల్లి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేత్తన్నానే.. కాస్త నవ్వవే..!

పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తీసుకెళ్లగా అత్యవసర సిబ్బంది చనిపోయినట్లుగా తెలిపారు. అయితే మరణానికి గల కారణాలను మాత్రం తెలియజేయలేదు. అయితే ఇటీవల మిచెల్ కాలేయ మార్పిడి చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు గుర్తు చేసినా.. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. అయితే కాలేయ మార్పిడి వికటించి చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి కుట్రలు లేవని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Online Love Scam: ఇలా ఉన్నారేంట్రా బాబు.. వాట్సప్ లోనే పరిచయం.. ప్రేమ..పెళ్లి.. కాపురం!

1996లో వచ్చి ‘‘హ్యారియెట్ ది స్పై’’లో నటించిన పాత్రకు మిచెల్‌కు మంచి పేరు కూడా వచ్చింది. ‘‘బఫీ ది వాంపైర్ స్లేయర్’’ అనే సీరియల్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇందులో డాన్ పాత్రను పోషించింది. 2000 నుంచి 2003 వరకు ఈ షోలో నటించింది. అనంతరం 2008 నుంచి 2012 వరకు ‘గాసిప్ గర్ల్’ అనే హిట్ షోలో సోషలైట్ విలన్ జార్జినా స్పార్క్స్‌గా నటించింది. బ్లేక్ లైవ్లీ, పెన్ బాడ్గ్లే, లైటన్ మీస్టర్ వంటి సహనటులతో కలిసి ఆమె నటించింది. యూరోట్రిప్, 17 ఎగైన్, ది స్క్రిబ్లర్ అనే చిత్రాల్లో నటించారు.

ఇది కూడా చదవండి: MLC Elections 2025: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!