Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య..

Bangladesh

Bangladesh

Banglasesh: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ యువకుడిని అక్కడి మతన్మాదులు హత్య చేశారు. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యల తర్వాత ఇది మూడో ఘటన. మైమన్‌సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ను 22 ఏళ్ల నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

భాలుకా ఉపజిల్లాలోని లాబిబ్ గ్రూప్ ఫ్యాక్టరీ అయిన సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్‌లో సోమవారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భజేంద్రతో పాటు, నోమన్ కూడా ఒకటే యూనిట్‌లో పనిచేస్తున్నారు. భజేంద్ర ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ కింద అన్సార్ అనే దళం పనిచేస్తుంది. దీంతోనే భజేంద్ర పనిచేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరూ కూడా భద్రతా విధుల్లో ఉన్నారు. ఇద్దరూ మాటల్లో ఉండగా, నోమన్ ప్రభుత్వం ఇచ్చిన తుపాకీని బిశ్వాస్‌ వైపు సరదాగా గురిపెట్టాడు. ఆ తర్వాత కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్ష్యలు చెబుతున్నారు.

Read Also: Walking for Weight Loss: శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా.. ఇలా చేస్తే వెంటనే కరిగిపోతుంది..

అంతకుముందు, బంగ్లాదేశ్‌ రాడికల్ ఇస్లామిస్ట్ నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత, ఆ దేశంలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మైమన్‌సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తిని ‘‘దైవదూషణ’’ ఆరోపనలతో అక్కడి మతోన్మాద మూక దారుణంగా హత్య చేసి, నగ్నంగా శరీరాన్ని రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి కాల్చేశారు. దీని తర్వాత, రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ అనే వ్యక్తిపై మూక దాడి జరిగింది. గ్రామస్తులంతా కలిసి అమృత్‌ను కొట్టి చంపారు.

Exit mobile version