NTV Telugu Site icon

Hindus In Bangladesh: దుర్గాపూజ చేయాలంటే రూ. 5 లక్షలు ఇవ్వండి.. హిందూ టెంపుల్స్ కి బెదిరింపులు..!

Bangla Desh

Bangla Desh

Hindus In Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హిందూ సమాజమే లక్ష్యంగా బెదిరింపులకు దిగుతున్నారు. దుర్గుపూజ చేసుకునేందుకు 5 లక్షల బంగ్లాదేశ్ టాకా ఇవ్వాలని ఇస్లామిక్ ఛాందసవాద గ్రూపులు దేవాలయాలు, కమిటీలకు బెదిరింపు లేఖలు పంపినట్లు సమాచారం. ఆ మొత్తం చెల్లించకుంటే పూజకు అనుమతించబోమని చెప్పారు. అలాగే, దుర్గామాత విగ్రహాన్ని పగలగొడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: ED Raids : చైనా 400 కోట్ల గేమింగ్ యాప్ కుట్ర బట్టబయలు చేసిన ఈడీ ..రూ.25కోట్లు స్వాధీనం

కాగా, రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు దుర్గాపూజ చేయడానికి దేవాలయాల నుంచి 5 లక్షల రూపాయలను డిమాండ్ చేశాయని హిందూ సంఘాలు తెలిపాయి. అలాగే, ఖుల్నా జిల్లాలోని డాకోప్‌లో ని హిందూ సంఘాలకు చెందిన పూజా కమిటీలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి లేఖలు వచ్చాయి. చెప్పిన మొత్తాన్ని చెల్లించకుంటే.. దుర్గాపూజకు అనుమతించేది లేదని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. సెప్టెంబర్ 22న లక్ష్మీగంజ్ జిల్లాలోని రాయ్‌పూర్ ప్రాంతంలో కొందరు మదర్సా కుర్రాళ్లు దుర్గా విగ్రహాలను పగలగొట్టారు. దీంతో పాటు బార్గునా జిల్లాలోని ఒక ఆలయంలో గల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు హిందూ సంఘాలు వెల్లడించాయి. ఇక, బంగ్లాదేశ్ లో అక్టోబర్ 9 నుంచి 13 వరకు దుర్గాపూజ జరుపుకుంటారు. విశేషం ఏమిటంటే ఇది బంగ్లాదేశ్ హిందువులకు అతి పెద్ద పండుగ.

Read Also: Dr K Laxman: చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలి..

అలాగే, ఇటీవల చిట్టగాంగ్, ఖుల్నా జిల్లాల అధికారులకు హిందూ సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ యూనిటీ కమిటీ కూడా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కమిటీ 6 మంది సభ్యులతో కూడిన సెల్‌ను కూడా ఏర్పాటు అయింది. ఇది మైనారిటీ వర్గాల ప్రజల యొక్క భద్రతను చూసుకుంటుంది. ఇక, చిట్టగాంగ్ జిల్లాకు చెందిన సనాతన్ విద్యార్థి సంసద్ అధ్యక్షుడు కుశాల్ చక్రవర్తి ఛానెల్‌తో మాట్లాడుతూ.. మా మనసుల్లో భయం ఉంది.. మా భద్రత కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం.. ఫరీద్‌పూర్, ఖుల్నాతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి.. మేము దుర్గాపూజ కోసం సిద్ధం చేస్తున్నామని తెలిపారు.