Site icon NTV Telugu

Hindu Temple Vandalised: ఖలిస్తానీ మద్దతుదారుల దుశ్చర్య.. మరో హిందూ ఆలయంపై దాడి..

Austalia

Austalia

Hindu Temple Vandalised In Australia: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు హిందూ ఆలయాలే టార్గెట్ గా ఆస్ట్రేలియాలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలో రెండు రెండు ఆలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ రెండు సంఘటనలు కూడా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. విక్టోరియాలోని క్యారమ్స్ డౌన్స్ లోని చారిత్రాత్మక శ్రీ విష్ణు దేవాలయంపై సోమవారం దాడి జరిగినట్లు అక్కడి మీడియా మంగళవారం నివేదించింది. అంతకుముందు మెల్బోర్న్ లోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిర్ గేటుపై గ్రాఫిటీతో భారత వ్యతిరేక, ఖలిస్తానీ అనుకూల నినాదాలను రాశారు దుండగులు.

Read Also: Adulterated Oil Mafia: కల్తీ ఆయిల్ మాఫియా….ఆవు కళేబరాలనుంచి తయారీ

మూడు రోజుల పాటు జరిగే ‘‘ తై పొంగల్’’ పండగను అక్కడి తమిళ హిందూ సమాజం పెద్ద ఎత్తున జరుపుకుంటుంది. అయితే భక్తులు దర్శనం కోసం వెళ్లిన సమయంలో ఆలయంపై దాడిని గమనించారు. ఖలిస్తానీ మద్దతుదారులు ఎటువంటి భయం లేకుండా ఇలా వ్యవహరించడంపై అక్కడి హిందూ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ సమాజాన్ని భయపెట్టడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా విక్టోరియా చాప్టర్ ప్రెసిడెంట్ మకరంద్ భగవత్ మాట్లాడుతూ.. ఖలిస్థాన్ ప్రచారం కోసం రెండవ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మెల్బోర్న్ హిందూ కమ్యూనిటీ సభ్యుడు సచిత్ మహతే మాట్లాడుతూ.. ఖలిస్తానీ మద్దతుదారులకు ధైర్యం ఉంటే, వారు శాంతియుత హిందూ మత స్థలాలపై లక్ష్యంగా చేసుకోవడం కాదు విక్టోరియన్ పార్లమెంట్ భవనంపై గ్రాఫిటీ వేయాలని సవాల్ విసిరారు.

Exit mobile version