Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి.. నిప్పంటించిన మతోన్మాదులు..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. వరసగా మైనారిటీ హిందువుల్ని టార్గెట్ చేస్తూ, మతోన్మాదులు క్రూరమైన హత్యలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మూకదాడి జరిగింది. 50 ఏళ్ల వ్యక్తి ఖోకన్ దాస్‌పై హింసాత్మక గుంపు దాడికి పాల్పడింది. 50 ఏళ్ల వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డాడు. అతడికి నిప్పంటించి, హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లాలో డిసెంబర్ 31న జరగింది. దాస్ ఇంటికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఒక గుంపు పదునై ఆయుధాలతో అతడిపై దాడి చేసి, కొట్టి, నిప్పంటించింది.

Read Also: Talaria Komodo: సూపర్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ రిలీజ్.. ధర, ఫీచర్స్ పూర్తి వివరాలు ఇవే..

ఇటీవల కాలంలో, బంగ్లాలోని హిందువులపై జరిగిన నాలుగో దాడి ఇది. డిసెంబర్ 18న మైమన్‌సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న దీపు చంద్ర దాస్ అనే వ్యక్తి ‘‘దైవదూషణ’’కు పాల్పడ్డాడనే నకిలీ ఆరోపణలపై అతడిని దారుణంగా కొట్టి, హతమార్చి, రోడ్డు పక్కన చెట్టుకు నగ్నంగా వేలాడదీసి కాల్చారు. ఆ తర్వాత డిసెంబర్ 25న బంగ్లాదేశ్‌లోని కాలిమోహర్ యూనియన్‌లోని హుస్సేన్‌దంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మోండల్ అనే మరో హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపారు. ఈ సంఘటన తర్వాత మైమన్‌సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ను 22 ఏళ్ల నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి చంపాడు.

Exit mobile version