Hindu girl abducted in Pakistan’s Sindh, fourth incident in 15 days: పాకిస్తాన్ దేశంలో హిందూ బాలికలు, యువతుల కిడ్నాపులు, పెళ్లిళ్లు చేసుకుని బలవంతపు మతమార్పులు చేయడం ఆగడం లేదు. తాజాగా మరో హిందూ బాలిక కిడ్నాపుకు గురైంది. గత 15 రోజుల్లో ఇది నాలుగో ఘటన. పాకిస్తాన్ జనాభాలో 3.5 శాతం మాత్రమే ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు ఉన్నారు. వీరంతా బలవంతపు మతమార్పిడులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల బలవంతపు మతమార్పుడులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును పాకిస్తాన్న పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది. అంటే అక్కడి ప్రభుత్వాలే బలవంతపు మతమార్పుడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ సింధు ప్రావిన్సులోని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ హిందూ బాలిను కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ ఫతే చౌక్ నుంచి ఇంటికి వస్తున్న చంద్ర మోహ్ రాజ్ అనే బాలికను కిడ్నాప్ చేశారు దుండగులు. అయితే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. బాలికను ఇంకా కనుక్కోలేదు. ఇటీవల సింధు ప్రావిన్సులోనే ముగ్గురు హిందూ మతానికి చెందిన యువతులను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన కొద్ది రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Ajayante Randam Moshana: త్రీడీ మూవీతో మల్లూవుడ్‌లోకి ‘ఉప్పెన’ భామ
సెప్టెంబర్ 24న మీనా మేఘ్వాల్ం అనే 14 ఏళ్ల బాలిను నాసర్ పూర్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. మిర్‌పుర్‌ఖాస్ పట్టణంలో ఇంటికి తిరిగివస్తుండగా మరో బాలికను కిడ్నాప్ చేశారు. అదే పట్టణంలో రవీ కుర్మీ అనే హిందూ వ్యక్తి భార్య రాఖీని కిడ్నాప్ చేసి ముస్లిం మతానికి చెందిన వ్యక్తితో వివాహం చేసి, బలవంతంగా మతం మార్చారు. సదరు మహిళకు అప్పటికే పెళ్లై ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే రాఖీ ఇష్టానుసారమే అహ్మద్ చండియోను వివాహం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెళ్లడించారు. ఈ ఘటనలకు ముందు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుకు చెందిన ఓ సిక్కు మహిళా టీచర్ ను కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసి, మతాన్ని మార్చారు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్ పై అఘాయిత్యాలు పెరిగాయి. ఈ ఏడాది జూన్ లో తనకు బలవంతంగా పెళ్లి చేసి ఇస్లాం మతంలోకి మార్చారని.. హిందూ యువతి కరీనా కుమారి కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనకు ముందు సత్రన్ ఓడ్, కవితా భీల్, అనితా భీల్ అనే ముగ్గురు హిందూ బాలికలు కూడా ఇదే విధంగా కిడ్నాపులకు గురై, పెళ్లి చేసి బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. మార్చి 21న పూజా కుమారి అనే హిందూ బాలిక పెళ్లికి నిరాకరించిందని సుక్కూర్ ప్రాంతంలో తన ఇంటి వెలుపల హత్యకు గురైంది.
