NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ లో హిందూ కుటుంబంపై దాడి

Pakistan

Pakistan

Hindu family in Pakistan attacked by politician’s relative: పాకిస్తాన్ లో హిందూ మైనారిటీలపై దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోని హిందూ మైనారిటీల సంఖ్య కేవలం 1-2 శాతానికి పడిపోయింది. గతంలో పాకిస్తాన్ లో హిందూ జనాభా 10 శాతం కన్నాఎక్కువగా ఉండేవారు. అయితే మెజారిటీ వర్గం వేధించడంతో చాలా మంది బలవంతంగా మతం మారారు. మరికొన్ని సార్లు హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లి వివాహం చేసుకుని మతం మార్చారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందు దేవాలయాలపై కొందరు మతఛాందసవాదులు దాడులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ చిన్న కారణానికి పాకిస్తాన్ లో ఓ హిందు కుటుంబం దాడి జరిగింది. రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తి తన కారును ఓవర్ టేక్ చేశారనే చిన్న కారణంతో కుటుంబం దాడికి పాల్పడ్డాడు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లో ఓ హిందూ కుటుంబం తమ వాహనంలో వెళ్తుంటే.. పాక్ సింధ్ ప్రావిన్స్ పశుసంవర్థక శాఖ మంత్రి అబ్దుల్ బారీ పితాఫీ బంధువు దాడి చేశాడు. ఈ దాడి ఘటన పాకిస్తాన్ లో వైరల్ గా మారింది.

Read Also: Sun Is Angry: ఉగ్రరూపం దాలుస్తున్న సూర్యుడు.. అసలు కారణాలేంటి..

హైవేపై వెళ్తున్న క్రమంలో మంత్రి బంధువు షంషేర్ పిటాఫీ వాహనాన్ని హిందూ కుటుంబం ఓవర్ టేక్ చేసింది. ఆ సయమంలో వాహనంలోని పిల్లవాడు ఐస్ క్రీమ్ రేపర్ ను బయటకు విసిరేశాడు. ఇది మంత్రి బంధువు వాహనం విండ్ షీల్డ్ ను తాకింది. దీంతో ఆగ్రహించిన షంషేర్ పిటాఫీ తన గార్డులతో కలిసి హిందూ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో కారులో ఓ వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిపై మంత్రి బంధువు అనుచితంగా ప్రవర్తించాడు. సంఘర్ లో నివసించే హిందూ కుటుంబం రహర్కి సాహిబ్ ఆలయాన్ని దర్శించుకుని వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.