కలవరపెడుతోన్న బీఏ.2 వేరియంట్.. డబ్ల్యూహెచ్‌వో ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి విజృంభణ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది.. ఇక, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత టెన్షన్ పెడుతోన్న సమయంలో.. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. ప్రస్తుతం బీఏ.2 వేరియంట్ పలు దేశాలకు కునుకులేకుండా చేస్తోంది.. అయితే, బీఏ.2 వేరియంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఆ వేరియంట్‌పై నిర్వహించిన స్టడీ ప్రకారం.. ఇప్పటికే దాదాపు 60 దేశాలకు పాకేసింది.. ఒమిక్రాన్ వేరియంట్ కన్నాఇది రెట్టింపు స్పీడ్‌తో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్ ఇచ్చింది.. ఈ వేరియంట్ కూడా సౌతాఫ్రికాలోనే 10 వారాల క్రితం వెలుగు చూసిన విషయం తెలిసిందే కాగా.. చాలా తక్కువ సమయంలో 57 దేశాలను చుట్టేసి ఆందోళన కలిగిస్తోందని ఆ పరిశోధన పేర్కొంది.
బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన వేరియంట్‌లు గుర్తించబడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో పేర్కొంది.. ఇక, బీఏ.2 సబ్ వేరియంట్ ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించింది.. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని కూడా బీఏ.2 ఏ మార్చే అవకాశం ఉందని తెలిపింది.. మరోవైపు, కొత్త వేరియంట్ ఇమ్యూనిటీ నుంచి సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకునే అవకాశం లేకపోలేదని.. బీఏ.1, బీఏ.1.1 వేరియంట్‌లను గుర్తించామని, గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్‌కి 96 శాతం.. ఓమిక్రాన్ వేరియంట్‌ను పోలి ఉందని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.. బీఏ.2 వేరియంట్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనేక ఉత్పరివర్తనాలు కల్గి ఉండి, స్పష్టమైన పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Also Read
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
- Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్‌కు ఎక్కడ చెడింది?
- Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
తాజావార్తలు
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
-
Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
-
Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Palak Pakoda Recipe: సింపుల్‌గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!