Site icon NTV Telugu

క‌ల‌వ‌ర‌పెడుతోన్న బీఏ.2 వేరియంట్‌.. డ‌బ్ల్యూహెచ్‌వో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

WHO

WHO

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన‌సాగుతూనే ఉంది.. ఇక‌, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మ‌రింత టెన్ష‌న్ పెడుతోన్న స‌మ‌యంలో.. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. ప్రస్తుతం బీఏ.2 వేరియంట్‌ పలు దేశాల‌కు కునుకులేకుండా చేస్తోంది.. అయితే, బీఏ.2 వేరియంట్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో).. ఆ వేరియంట్‌పై నిర్వ‌హించిన స్ట‌డీ ప్ర‌కారం.. ఇప్ప‌టికే దాదాపు 60 దేశాల‌కు పాకేసింది.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కన్నాఇది రెట్టింపు స్పీడ్‌తో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్ ఇచ్చింది.. ఈ వేరియంట్ కూడా సౌతాఫ్రికాలోనే 10 వారాల క్రితం వెలుగు చూసిన విష‌యం తెలిసిందే కాగా.. చాలా తక్కువ సమయంలో 57 దేశాల‌ను చుట్టేసి ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని ఆ ప‌రిశోధ‌న పేర్కొంది.

బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన వేరియంట్‌లు గుర్తించబడినట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప‌రిశోధ‌న‌లో పేర్కొంది.. ఇక‌, బీఏ.2 సబ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వెల్ల‌డించింది.. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని కూడా బీఏ.2 ఏ మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.. మ‌రోవైపు, కొత్త వేరియంట్‌ ఇమ్యూనిటీ నుంచి సబ్‌ వేరియంట్‌ సులభంగా తప్పించుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని.. బీఏ.1, బీఏ.1.1 వేరియంట్‌లను గుర్తించామని, గ్లోబల్‌ సైన్స్‌ ఇనిషియేటివ్‌కి 96 శాతం.. ఓమిక్రాన్‌ వేరియంట్‌ను పోలి ఉందని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది.. బీఏ.2 వేరియంట్‌ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనేక ఉత్పరివర్తనాలు కల్గి ఉండి, స్పష్టమైన పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Exit mobile version