Israel’s Netanyahu: హెజ్‌బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లాను మట్టుబెట్టిన వారం రోజుల్లోనే అతడి వారసుడిగా భావిస్తోన్న హషీమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ చంపేసినట్లు బెంజమిన్ నెతాన్యహు ప్రకటించారు. అయితే, లెబనాన్‌లోని దాహియాలో ఓ బంకర్‌లో సీనియర్ హెజ్‌బొల్లా నేతలతో హషీమ్ భేటీ నిర్వహించనున్నారన్న పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ ఇటీవల దాడులను కొనసాగింది. ఈ యుద్ధం ముగియాలంటే హెజ్‌బొల్లాను దేశం నుంచి తరిమికొట్టాలని లెబనాన్‌కు సూచనలు చేశారు. లేనిపక్షంలో.. గాజా మాదిరి విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నెతన్యూహూ హెచ్చరించారు.
ఇక, హషీమ్ సఫీద్దీన్.. ప్రస్తుతం హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతిగా, జిహాద్ కౌన్సిల్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇతకు హసన్ నస్రల్లాకు దగ్గరి బంధువు.. 2017లో హషీమ్‌ను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించడంతో పాటు నస్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా పగ్గాలు ఆయనకే అందబోతున్నాయనే వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా.. బీరుట్‌లోని దాహియా ప్రాంతంలో సెప్టెంబరు చివరి వారంలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో నస్రల్లా మరణించారు. ఇదే ప్రాంతంలో సఫీద్దీన్‌నూ కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.