Site icon NTV Telugu

చైనాలో హెర్డ్‌ ఇమ్యూనిటీ.. కీలక విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది.. ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లే కాకుండా.. మళ్లీ కొన్ని దేశాలు ఇప్పుడు కొత్త వేరింయట్‌ కలకలం సృష్టిస్తోంది.. ఇదే సమయంలో డ్రాగన్‌ కంట్రీలోనూ మళ్లీ పాజిటివ్‌ కేసులు కలవరపెడుతున్నాయి.. దీంతో.. కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. లాక్‌డౌన్‌కు కూడా వెళ్తున్నారు. ఇక, చైనాలో హెర్డ్ ఇమ్యూనిటీపై అంచనాలు వేస్తున్నారు ఆ దేశ శాస్త్రవేత్తలు.. తాజాగా, చైనా శాస్త్రవేత్త, ప‌ల్మనాల‌జీ నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ కీల‌క వ్యాఖ్యలు చేశారు.. చైనాలో 2022 తొలి అర్థభాగంలో కరోనా వైరస్‌ నుంచి హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పాడే అవ‌కాశం ఉందని వెల్లడించారు.

అయితే, మ‌నుషుల్లో స‌హ‌జంగా ఓ వ్యాధి ప‌ట్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డ‌మే హెర్డ్ ఇమ్యూనిటీగా చెబుతారు.. ఇక, చైనాలో పుట్టిన కరోనా మహమ్మారిపై ఆ దేశ శాస్త్రవేత్తలు ఈ అంచనా వేస్తున్నారు… వైర‌స్ నియంత్రణ‌కు, వ్యాధి తీవ్రత అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల‌ను జాంగ్ నాన్‌షాన్ సూచించారు. శ్వాస‌కోస వ్యాధుల నిపుణుడైన నాన్‌షాన్‌కు, ఆయ‌న బృందానికి.. చైనా సర్కార్‌ ఈ మధ్యే అవార్డును కూడా ప్రక‌టించింది. అయితే, అక్కడ‌క్కడ క‌రోనా వ్యాపిస్తున్నద‌ని, ఆ వ్యాధిని నెల రోజుల్లోనే స‌మ‌ర్థవంతంగా అరిక‌ట్టవ‌చ్చు అంటున్నారాయన..

Exit mobile version