Site icon NTV Telugu

Texas Flash Floods: టెక్సాస్‌ని ముంచెత్తిన వరదలు

Texas Floods

Texas Floods

అకాల వర్షాలు, ముంచుకొస్తున్న వరదలు ప్రపంచంలోని కొన్ని దేశాలను అతలాకుతలం చేసేస్తున్నాయి. తాజాగా టెక్సాస్ లో భారీ వర్షాలు, వరదలు అపార నష్టాన్ని కలిగించాయి. ఆకస్మిక వరదలు మరియు కుండపోత వర్షం యునైటెడ్ స్టేట్స్‌లోని టెక్సాస్‌లో తుఫానుకు దారితీసింది, వందల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్‌లోని జాతీయ పార్కులను వర్షాలు తాకాయి. కొన్ని పక్షులు వరదలలో కొట్టుకుపోయినట్లు వార్తలు వచ్చాయి. డల్లాస్, టెక్సాస్ లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వేలాదికార్లు జాతీయ రహదారిపై నీళ్ళలో మునిగిపోయాయి. దాదాపు కార్లు కనిపించనంతగా రోడ్లపై నీరు నిలబడిపోయింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం దాదాపుగా అసంభవంగా మారిందని పౌరులు తెలిపారు.

ఉత్తర టెక్సాస్ మరియు దక్షిణ ఓక్లహోమా నుండి మిస్సిస్సిప్పి యొక్క మధ్య భాగాల వరకు ఉన్న కారిడార్ భారీ వర్షాల జోన్‌లో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రదేశాలలో భారీ వర్షం రాబోయే రోజులలో కురిసే అవకాశం ఉందని, అంతా అప్రమత్తంగా వుండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ భారీవర్షాల వల్ల డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్‌లో బాగా కనిపించింది. భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసినందున, అర్థరాత్రి ఆకస్మిక వరద హెచ్చరికలు మొదట జారీ చేయబడ్డాయి. కొన్ని గంటల్లోనే వీధులన్నీ వరదలతో ముంచెత్తాయి. ప్రజలు బయటకు రావడానికి బాగా ఇబ్బంది పడుతున్నారని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 4 నుండి 7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది, అయితే కొన్ని చోట్ల 9 మి.మీటర్ల కంటే ఎక్కువ వాన పడిందని చెబుతున్నారు. ఈ వర్షంలో ఎక్కువ భాగం కేవలం కొన్ని గంటల్లోనే కురిసింది, అంటే వరద నీరు ఒకేచోట ఆగిపోయింది. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారులు సోమవారం తెల్లవారుజామున లోతైన వరదలతో మూసుకుపోయినట్లు నివేదికలు వెల్లడయ్యాయి. అనేక రోడ్లు మరియు ఇతర గట్టి ఉపరితలాలు ఉన్న ప్రాంతంలో వర్షం చాలా త్వరగా కురుస్తున్నందున మరింత వరదల ప్రమాదం వుందని నిపుణులు అంటున్నారు. ఈ వేసవి ప్రారంభంలో సెయింట్ లూయిస్ మరియు కెంటుకీలోని కొన్ని ప్రాంతాల్లో సంభవించిన ఘోరమైన వరదలు కొన్ని గంటల వ్యవధిలో మాత్రమే సంభవించాయి.

Read Also: BJP MLA Raja Singh: ధర్మం కోసం చావడానికైనా సిద్ధం.. మళ్లీ వీడియో పెడతా.. రాజాసింగ్‌ సవాల్‌..!

Exit mobile version