Site icon NTV Telugu

Explosion In Armenia: బాణాసంచా గిడ్డంగిలో పేలుడు.. 11 మంది దుర్మరణం

Explosion In Armenia

Explosion In Armenia

Explosion In Armenia: అర్మేనియా రాజధాని యెరవాన్‌లోని బాణాసంచా గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. సుమారు 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. అనేక మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం నాడు జరిగిన ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. ఆదివారం అర్మేనియా రాజధాని యెరెవాన్‌లోని బాణాసంచా గిడ్డంగిలో పేలుళ్లు సంభవించాయి. బిల్డింగ్ భాగాలు కూలిపోయి కనీసం 62 మంది గాయపడ్డారు.

Dwakra Products: అమెజాన్‌లో ఏపీ డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయాలు

వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండు సార్లు భారీగా పేలుళ్ల శబ్దాలు వచ్చాయని, భవనంలోని కొంత భాగం కూలినట్లు ప్రాథమిక సమాచారం సూచించినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొంది.

Exit mobile version