మొన్నటి వరకు కరనా మహమ్మారి అమెరికాను భయపెట్టింది. వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయడంతో ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్క్ తప్పనిసరిగా విధానానికి స్వస్తి పలికారు. అయితే, ఇప్పుడు ఆ దేశాన్ని మరోసమస్య వేధిస్తోంది. అమెరికాను హీట్ వేవ్ ఇబ్బందులు పెటుతున్నది. గత కొన్ని రోజులుగా ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో వేడిగాలులు వీస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభంలో 49 డిగ్రీలకు పైగా ఉష్ణ్రోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడు ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదుకాలేదని, రాబోయే వారం రోజులు సాధారణం కంటే 10-20 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పోర్ట్‌ల్యాండ్ వాతావరణ శాఖ పేర్కొన్నది.
Read: తాప్సీకి మరోసారి తలంటిన ‘తలైవి’!
ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రావోద్దని, సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించింది. ఇక, కెనడాలో 84 ఏళ్ల క్రితం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి, కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిత్యం చల్లగా ఆహ్లదకరంగా ఉండే అమెరికా, కెనడా దేశాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీస్థాయిలో ఉష్ణోగ్రతలు, వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.
