NTV Telugu Site icon

Hamas Atrocities: “గన్‌తో బెదిరించి అత్యాచారం చేసేవారు”.. ఇజ్రాయిల్ బందీలపై హమాస్ అకృత్యాలు..

Amit Soussana

Amit Soussana

Hamas Atrocities: హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడ్డారు. 1200 మందిని చంపడంతో పాటు పలువురు ఇజ్రాయిలీలను బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అయితే, వీరు ఇజ్రాయిలీలపై బలవంతంగా జరిపిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిబ్బట్జ్ క్ఫర్ అజా నుంచి బందీగా చిక్కిన అమిత్ సౌసానా అనే 40 ఏళ్ల యువతి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడించింది. బందీల మార్పిడిలో వారి నుంచి విముక్తి పొందిని వృత్తిరీత్యా నాయవాది అయిన సౌసానా హమాస్ మిలిటెంట్లు ఎలా ప్రవర్తించేవారో వెల్లడించింది. దాడి సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన సమయంలో హమాస్ మిలిటెంట్లు సౌసాను తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ అయింది.

లైంగిక వేధింపులపై బహిరంగంగా మాట్లాడిన తొలి ఇజ్రాయిలీ బందీ అని న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. తనను బందీగా తీసుకున్న కొద్దిసేపటికే తమపై వేధింపులు ప్రారంభమైనట్లు అమిత్ సౌసానా వెల్లడించారు. 55 రోజుల పాటు హమాస్ చెరలో ఉన్న ఈమె, బందీల విడుదలలో బయటపడింది. మహ్మద్ అనే వ్యక్తి తనపై తరుచుగా లైంగిక వేధింపులకు పాల్పడే వాడని చెప్పింది. తన డ్రెస్ ఎత్తి, గట్టిగా హత్తుకునే వాడని, తన ఇంటిలో బంధించి తనను వేధించడం ప్రారంభించాడని ఆమె చెప్పింది.

Read Also: Jio World Garden: ముకేశ్ అంబానీ సంపన్నుల కోసం కట్టించిన పెళ్లి వేదిక అద్దె ఎంతో తెలుసా?

స్నానం చేయడానికి కట్లు విడిచిన తర్వాత తనపై దాడికి పాల్పడ్డాడని, తన ముఖానికి తుపాకీ గురిపెట్టి, బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆమె తన వేధింపులను వెల్లడించింది. అతను లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉండేవాడని, తనకు మసాజ్ చేయవచ్చా అని అడుగుతుండే వాడని, పీరియడ్స్ ఎప్పుడు వస్తాయని రోజూ అడుగుతుండే వాడని ఆమె వెల్లడించింది.

అయితే, తన చర్యలపై పశ్చాత్తాపం వ్యక్తి చేస్తూ.. ఈ విషయాన్ని ఇజ్రాయిల్‌కి తెలియజేయవద్దని చివరకు వేడుకున్నాడని సౌసానా చెప్పారు. తనను వేరే ప్రాంతానికి మార్చిన తర్వాత కూడా తనపై వేధింపులు ఆగలేదని తరుచూ కొట్టేవారని చెప్పింది. 240 మంది బందీల్లో ఇప్పటికీ 130 మంది బందీలు ఇంకా హమాస్ కస్టడీలోనే ఉన్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 7న జరిగిన దాడితో ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇప్పటికే 32,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.