NTV Telugu Site icon

Hassan Nasrallah: నస్రల్లాతో సహా హిజ్బుల్లా 9 మంది కమాండర్లు హతం.. తర్వాతి నాయకుడు ఇతడేనా..?

Hassan Nasrallah Killed

Hassan Nasrallah Killed

Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. శుక్రవారం లెబనాన్‌లోని బీరూట్‌తో సహా ఇతర ప్రాంతాల్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది. ఇకపై ఉగ్రవాదంతో నస్రల్లా ప్రపంచాన్ని భయపెట్టలేడని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే హిజ్బుల్లా కీలక కమాండర్లు అందరూ హతమయ్యారు. ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్, ఇబ్రహీం మహ్మద్ కబిషీ, అలి కరాకీ, మహ్మద్ నసర్, సమి తలేబ్ అబ్దు్ల్లా, మహ్మద్ హుస్సేన్ స్రౌర్, అబూ హుసేన్ సమీర్, విస్సమ్ అల్ తవీల్ మరణించారు. ఇప్పుడు ఒక అబూ అలీ రిదా మాత్రమే టాప్ కమాండర్లలో బతికి ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది.

గత 32 ఏళ్లుగా హిజ్బుల్లాకు నాయకత్వం వహిస్తున్న 64 ఏళ్ల నస్రల్లా బీరూట్‌లో అత్యంత సురక్షితమైన స్థావరంలో ఉండగా, ఇజ్రాయిల్ భీకర దాడి చేసింది. ఈ దాడిలో నస్రల్లాతో పాటు అతని కుమార్తె జైనాబ్ కూడా మరనించినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. లెబనాన్‌కి ప్రధాని, అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా వాస్తవ పాలకుడు మాత్రం హసన్ నస్రల్లానే. ఇతని ఆదేశాల మేరకే వారంతా పనిచేసేవారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు హిజ్బుల్లా మొత్తం వ్యవస్థ దాదాపుగా దెబ్బతింది.

Read Also: Rolls-Royce Cullinan Series II: రోల్స్ రాయిస్ నుంచి కొత్త వెర్షన్ లాంచ్.. పూర్తి వివరాలు ఇవే

చాలా ఏళ్లుగా నస్రల్లా బయటి ప్రపంచానికి కనపడకుండా కేవలం టీవీల ద్వారానే ప్రజలకు సందేశం ఇచ్చేవాడు. 1960లో జన్మించిన నస్రల్లా 1982లో ఇజ్రాయిలీ దండయాత్ర తర్వాత హిజ్బుల్లాలో చేరాడు. 1992లో అప్పటి హిజ్బుల్లా చీఫ్ అబ్బాస్ అల్ ముసావీ హత్య తర్వాత మూడు దశాబ్దాలుగా హిజ్బుల్లాను పాలిస్తున్నాడు. ప్రస్తుతం నస్రల్లా మరణం హిజ్బుల్లాకు కోలుకోని దెబ్బగా వర్ణించవచ్చు. ఇప్పటికే గత వారం జరిగిన పేజర్ల దాడిలో హిజ్బుల్లాకు సహకరించే వారు వందల్లో హతమయ్యారు. పేలుళ్ల ధాటికి కంటి చూపు, చేతులు కోల్పోయి జీవశ్చవాలుగా మారారు.

ఇప్పుడు హిజ్బుల్లాకు ఎవరు నాయకత్వం వహిస్తారనే సందేహం అందరిలో తలెత్తుతోంది. నస్రల్లాతో పాటు టాప్ కమాండర్లు 10 మందితో 9 మందిని ఇజ్రాయిల్ చంపేసింది. కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఈ నాయకత్వంలో ఏర్పడిన వాక్యూమ్ పూరించేది ఎవరి చూస్తున్నారు. కొత్తగా ఎన్నికయ్యే హిజ్బుల్లా చీఫ్‌కి అంతర్గత వర్గాలు, ఇరాన్ మద్దతుదారుల ఆమోదం ఉండాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు హషేమ్ సఫీద్దీన్ నస్రల్లా వారసుడిగా పరిగణించబడుతున్నాడు. హిజ్బుల్లా రాజకీయ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్న ‘‘జిహద్ కౌన్సిల్’’లో సభ్యుడైన సఫీద్దీన్ చనిపోయిన నస్రల్లాకు బంధువు. అమెరికా ఇతడిని 2017లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

Show comments