NTV Telugu Site icon

America: పర్సనల్‌ సెక్స్ ఫోటోలతో వేధింపులు.. బాధితురాలికి రూ.9,986 కోట్ల పరిహారం

America

America

America: వారిద్దరూ కలిసి జీవించారు. 5 సంవ్సరాలపాటు ఒకరికొకరు అన్నట్టు కలసి జీవించారు. అనంతరం ఇద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోయారు. విడిపోయిన తరువాత అతనికి ఆమెను వేధించి సాధించాలని అనుకున్నాడు. తాము ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ సెక్స్ ఫోటోలతోపాటు.. తన వ్యక్తిగత సెక్స్ ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టాడు. వాటికి సంబంధించిన లింకులను ఆమె స్నేహితులు, బంధువులకు పంపేవాడు. ఈ వేధింపులను భరించలేక తను పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు తను న్యాయం చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సివిల్‌ కోర్టును ఆశ్రయించింది. సివిల్‌ కోర్టు విచారణ చేపట్టి.. బాధితురాలికి న్యాయం జరిగేలా నష్టపరిహారం ఇవ్వాలని నిందితుడిని ఆదేశించింది. బాధితురాలికి నష్టపరిహారంగా రూ. 9986 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Read also: S*x With Dogs: వీళ్లసలు మనుషులేనా? కుక్కలతో శృంగారం చేసిన భార్యాభర్తలు

అమెరికాకు చెందిన ఓ మహిళ .. మార్క్వెస్‌ జమాల్‌ జాక్సన్‌ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించింది. వారు కలిసి షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత 2021 అక్టోబరులో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు. వారు విడిపోయిన తరువాత నుంచీ అతడి వేధింపులు మొదలయ్యాయి. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకొన్న ఫొటోలను శృంగార వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశాడు. వాటితోపాటు.. ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్‌, ఈ-మెయిల్‌ నుంచి సేకరించిన వ్యక్తిగత ఫొటోలను ఆమె అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాల ద్వారా పోస్టు చేశాడు. అలా పోస్టు చేసిన ఫొటోల లింకులను బాధితురాలి స్నేహితులు, కుటుంబసభ్యులకూ పంపాడు. ‘వాటిని ఇంటర్నెట్‌ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు నీ జీవితం సరిపోదు’ అంటూ ఆమెకు మొబైల్‌లో సందేశాలు పంపించేవాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు సైతం న్యాయం చేయకపోవడంతో .. ఆమె 2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్‌ కౌంటీ సివిల్‌ కోర్టులో దావా వేశారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం ఓ వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను మాజీ భాగస్వామి ఇంటర్నెట్‌లో షేర్‌ చేయడం నేరం… అంతే కాకుండా వ్యక్తిత్వానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసే ఇటువంటి చర్యలను ‘రివెంజ్‌ పోర్న్‌’గా వ్యవహరిస్తారు. కేసు విచారణ సందర్బంగా ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్‌ డాలర్లు (రూ.1,664 కోట్లు) చెల్లించడమే కాకుండా.. ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్‌ డాలర్లు (రూ.8,322 కోట్లు) చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.