Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hantavirus Outbreak: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు హంటావైరస్ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక క్రూయిజ్ షిప్లో హంటావైరస్ వ్యాప్తి కారణంగా ముగ్గురు మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తమైంది. ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనుషుల మధ్య కూడా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్రూయిజ్ షిప్లో కలకలం
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ అట్లాంటిక్‌లో ప్రయాణిస్తున్న ఒక క్రూయిజ్ షిప్లో మొత్తం ఎనిమిది హంటావైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించడంతో పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆ నౌకను స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల్లో నిలిపివేసి, బాధితులను ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా మరోసారి వైరస్ వ్యాప్తిపై భయాందోళనలు పెంచింది.
Also Read
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
హంటావైరస్ ఎలా వ్యాపిస్తుంది..?
హంటావైరస్ సాధారణంగా సోకిన ఎలుకల మలం, మూత్రం లేదా లాలాజలంతో సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా కలుషితమైన ప్రదేశాల్లో ఉండటం, ఎలుకలు సంచరించే ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి గుర్తించిన వైరస్ స్ట్రెయిన్ “ఆండెస్ వైరస్” కావడం నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణ అమెరికాలో కనిపించే ఈ స్ట్రెయిన్ పరిమిత పరిస్థితుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యం కలిగి ఉందని మేయో క్లినిక్ పేర్కొంది.
వాతావరణ మార్పులతో పెరుగుతున్న ప్రమాదం
గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా ఎలుకలు కొత్త ఆవాసాల కోసం మానవ నివాస ప్రాంతాలకు చేరుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సముద్ర ప్రయాణాలు, మూసివున్న ప్రదేశాలు, పరిశుభ్రత లోపించిన ప్రాంతాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
హంటావైరస్ లక్షణాలు ఇవే..
హంటావైరస్ లక్షణాలు మొదట్లో సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటాయి. దీంతో ప్రారంభ దశలో గుర్తించడం కష్టమవుతుంది.
* జ్వరం
* తీవ్రమైన తలనొప్పి
* కండరాల నొప్పులు
* చలి వేయడం
* కడుపు సమస్యలు
* వాంతులు
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
వ్యాధి ముదిరేకొద్దీ ఇది నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపి శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలపై కూడా ప్రభావం పడుతుంది. మరణాల రేటు ఎక్కువగా ఉండటంతో వెంటనే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం చాలా కీలకం.
WHO ఏమంటోంది..?
హంటావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాందోళనలపై WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ స్పందించారు. ప్రస్తుతం ఈ వైరస్ కోవిడ్-19 తరహా మహమ్మారిగా మారే ప్రమాదం చాలా తక్కువగా ఉందని స్పష్టం చేశారు. “ప్రజలు హంటావైరస్‌ను కరోనా వైరస్‌తో పోల్చకూడదు. ప్రస్తుతం ఇది ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు కాదు. అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకున్నాం. భయపడాల్సిన అవసరం లేదు” అని డాక్టర్ టెడ్రోస్ పేర్కొన్నారు.
చికిత్స ఉందా..?
ప్రస్తుతం హంటావైరస్‌కు ప్రత్యేక టీకా లేదా నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు. బాధితులను వెంటనే ఐసీయూలో చేర్చి ఆక్సిజన్ సపోర్ట్, ద్రవాలు అందించడం ద్వారా ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
నివారణే ఉత్తమ మార్గం
హంటావైరస్ నుంచి రక్షణ పొందడానికి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఎలుకలు సంచరించే ప్రదేశాలకు దూరంగా ఉండటం, ఇళ్లలో శుభ్రత కాపాడటం, కలుషిత ప్రాంతాల్లో మాస్కులు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!