పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్ర నేత హనియే హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. M90 రాకెట్స్‌ను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పేలుళ్లు వినిపించాయి. అయితే ప్రాణనష్టం జరిగించి మాత్రం ఎలాంటి సమాచారం అందలేదు. హమాస్‌కు చెందిన సాయుధ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ మంగళవారం ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ మరియు దాని శివారు ప్రాంతాలను లక్ష్యంగా రెండు ‘M90’ రాకెట్లు ప్రయోగించినట్లు సమాచారం. టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని.. అయితే ప్రాణనష్టం గురించి ఎటువంటి నివేదికలు లేవని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది.
ఇది కూడా చదవండి: Kejriwal: కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా బిగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కి అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల ఇరాన్‌లో హమాస్ అగ్ర నేత హనియే హత్యకు గురయ్యారు. దీనికి ఇజ్రాయెల్ బాధ్యత వహించినట్లుగా ఎక్కడా ప్రకటన చేయలేదు. కానీ ఇరాన్ మాత్రం అనుమానం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ కాలుదువ్వుతోంది.
ఇది కూడా చదవండి: Odisha: రోగులపై వైద్యుడు లైంగిక వేధింపులు.. చితకబాదిన బంధువులు