హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ మహిళా బందీ హతమైంది. ఈ మేరకు శనివారం హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడి చేసిన ఉత్తర గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ మహిళా బందీని హమాస్ హతమార్చింది. హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి శనివారం తెలిపారు.
ఇది కూడా చదవండి: Nagarjuna: ఏఎన్నార్ బయోపిక్ కష్టం.. నాగ్ కీలక వ్యాఖ్యలు
అక్టోబర్ 7, 2023లో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. బందీలను విడిపించుకుని వస్తామని ప్రమాణం చేశారు. దాదాపు 100 మందికి పైగా ఇజ్రాయెలీయులు హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు సమాచారం. తాజాగా ఒక మహిళా బందీని హమాస్ హతమార్చింది.
ఇది కూడా చదవండి: Hardik Pandya: 8 ఏళ్ల తర్వాత మరోసారి రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా
దాదాపు ఏడాదికిపైగా హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు గాజాపై దాడులకు తెగబడ్డారు. ఇప్పటికే గాజా పట్టణం నాశనం అయింది. వేలాది మంది పాలస్తీనీయలు ప్రాణాలు కోల్పోయారు. ఇక హమాస్‌కు మద్దతు పలికిన హిజ్బుల్లాను కూడా ఐడీఎఫ్ దళాలు అంతమొందించాయి. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చింది. అలాగే హమాస్ చీఫ్‌లను కూడా చంపేశారు. ఇక ఇజ్రాయెల్‌పై ఇరాన్ 180 క్షిపణులను ప్రయోగించింది. అనేక రాకెట్లను ఆకాశంలోనే పేల్చేసింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్.. ఇరాన్ అణు స్థావరాలను దెబ్బతీసింది.
ఇది కూడా చదవండి: PM Modi :జార్ఖండ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తా.. విజయోత్సవ వేడుకలో మోడీ