Site icon NTV Telugu

హైతీ భూకంపం: భారీగా పెరిగిన మ‌ర‌ణాలు…

శ‌నివారం రోజున క‌రేబియ‌న్ దీవుల్లోని హైతీలో భారీ భూకంపం సంభ‌వించిన  సంగ‌తి తెలిసిందే.  ఈ భూకంప విధ్వంసానికి వంద‌లాది ఇళ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి.  ఈ భూకంపం ధాటికి ఇప్ప‌టి వ‌ర‌కు 1300 మందికి పైగా మృతి చెందిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.  వంద‌లాది భ‌వ‌నాలు నేల‌మ‌ట్టం కావ‌డంతో, శిధిలాల కింద చిక్కుకున్న వారికి ర‌క్షించేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  హైతీలో సంభ‌వించిన ఈ భూకంపం రిక్ట‌ర్ స్కేలుపై 7.2 తీవ్ర‌త‌గా న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  రాజ‌ధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌కు 125 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప‌కేంద్రం ఉన్న‌ట్టుగా అధికారులు గుర్తించారు.  మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టుగా అధికారులు అంచ‌నా వేస్తున్నారు.  ఇక ఈనెల 7 వ తేదీన హైతీ అధ్య‌క్షుడు జొవెనెల్ మోయిస్ హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే.  ఆ విషాదం నుంచి హైతీ కోలుకోక ముందే భూకంపం విధ్వంసం సృష్టించింది.  

Read: “రామారావు”తో ఇల్లీ బేబీ స్పెషల్ సాంగ్

Exit mobile version