Site icon NTV Telugu

Canada: కెనడాలో రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. గురుద్వారా ధ్వంసం..

Kds Gurudwara

Kds Gurudwara

Canada: ఖలిస్తానీలకు అడ్డాగా ఉన్న కెనడాలో అరాచకం సృష్టిస్తున్నారు. వాంకోవర్‌లో ఒక గురుద్వారాపై దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. గురుద్వారాపై ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీతో రాతలు రాశారు. ఈ సంఘటన వాంకోవర్‌లోని ఖల్సా దివాన్ సొసైటీ లేదా KDS గురుద్వారాలో జరిగింది, దీనిని రాస్ స్ట్రీట్ గురుద్వారాగా పిలుస్తారు. సిక్కు దేవాలయం పార్కింగ్ స్థలం చుట్టూ ఉన్న గోడపై అనేక చోట్ల ‘‘ఖలిస్తాన్’’ అనే పదాన్ని స్ప్రే పెయింట్ చేసినట్లు గురుద్వారా పరిపాలన అధికారులు చెప్పారు.

Read Also: BJP MP: ‘‘ముస్లిం కమిషనర్’’.. మీ కాలంలోనే బంగ్లాదేశీయులకు ఓటర్ కార్డులు ఇచ్చారు..

కెనెడియన్ మీడియా ప్రకారం, సర్రేలో ప్రపంచంలోనే అతిపెద్ద వైశాఖి మార్చ్ జరిగిన శనివారం రోజే ఈ సంఘటన జరిగింది. దీనిపై వాంకోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. ఖల్సా దివాస్ సొసైటీ గత వారంలో వాంకోవర్‌లో నిర్వహించిన వైశాఖి మార్చ్‌లో ఖలిస్తానీ అనుకూలవాడులు పాల్గొనకుండా నిషేధించింది. ఖలిస్తాన్ కోసం వాదించే సిక్కు వేర్పాటువాదుల సమూహం ‘‘ఖలిస్తాన్ జిందాబాద్’ వంటి విభజన నినాదాలతో గురుద్వారా గోడల్ని ధ్వంసం చేసిందని ఖల్సా దివాస్ సొసైటీ పేర్కొంది.

‘‘కెనడియన్ సిక్కు సమాజంలో భయం, విభజనను కలిగించడానికి ప్రయత్నిస్తున్న తీవ్రవాద శక్తుల నిరంతర ప్రచారంలో ఈ చర్య భాగం. వారి చర్యలు సిక్కు మతం, కెనడియన్ సమాజం రెండింటికీ పునాది అయిన కలుపుగోలుతనం, గౌరవం, పరస్పర మద్దతు విలువలను దెబ్బతీస్తున్నాయి. కెనడియన్లుగా మనం ఎంతో ఇష్టపడే ఐక్యత మరియు శాంతికి విరుద్ధంగా, వారి చర్యలు మనల్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విభజన శక్తులను మనం విజయవంతం కానివ్వ’’ అని పేర్కొంది.

Exit mobile version