వెలుగు లేకుంటే మనిషిని మనుగడ సాధ్యం కాదు. వెలుతురు ఉన్నప్పుడే అన్ని చక్కదిద్దుకుంటాం. సూర్యుడు ఉదయం సమయంలో మనకు వెలుగును ఇస్తాడు. మరి రాత్రి సమయంలో మనకు వెలుగు కావాలంటే… ఈ ఆలోచనే బల్బును కనుక్కునే విధంగా చేసింది. ఎలక్ట్రికల్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. బయటకు వెళ్లాలంటే గతంలో టార్చిలైట్‌ను ఉపయోగిస్తారు. కెమెరాలో ఫ్లాష్ లైట్ ఉంటుంది. సాధారణంగా ఈ ఫ్లాష్ లైట్‌ను మాములు కళ్లతో చూడలేము. కాంతి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత కాంతివంతమైన ఫ్లాష్ లైట్‌ను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది హ్యాక్ స్మిత్ ఇండస్ట్రీస్ సంస్థ. ఇప్పటి వరకూ ఎవరూ తయారు చేయనంతటి కాంతితో ఫ్లాష్ లైట్‌ను తయారు చేసింది. దీని నుంచి 5 లక్షల ల్యూమెన్స్ కాంతి విడుదల అవుతుంది. ఉదయం సమయంలో సూర్యుడి కాంతికి ఆకాశంలోని చంద్రుడు, నక్షత్రాలు ఎలాగైతే కనిపించవో, ఈ ఫ్లాష్‌లైట్ కాంతిలో కూడా అక్కడ ఉన్న వస్తువులు ఏవీ కూడా కనిపించవు. గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ఈ ఫ్లాష్ లైట్ తయారు చేసినట్టు చెబుతున్నారు.
గిన్నీస్ రికార్డ్: ప్రపంచంలో అత్యంత కాంతివంతమైన ఫ్లాష్‌లైట్…
