NTV Telugu Site icon

US Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు దుర్మరణం

Kentucky Gunfire

Kentucky Gunfire

Gunman kills four in bank shooting Louisville Kentucky: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌విల్‌ ప్రాంతంలో ఒక చోట గుడిగూడిన జనంపైకి ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. ఐదుగురు దుర్మరణం చెందారు. అంతేకాదు.. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారితో పాటు ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో.. వారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Trinamool Congress: జాతీయ పార్టీ హోదా కోల్పోయిన టీఎంసీ…దీదీ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

లూయిస్‌విల్‌లో ఒక బ్యాంకు ఎదుట కొందరు జనం గుమిగూడారు. అప్పుడే ఒక దుండగుడు తుపాకీ చేతబట్టుకొని, ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో జనం ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అయితే.. అతడు జరిపిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. అతడు పాల్పడ్డ ఈ ఘాతుకానికి ఉలిక్కిపడ్డ బ్యాంకు భద్రతా సిబ్బంది.. వెంటనే అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ దుండగుడు కాల్పులు జరిపిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు.. 32 మండలాల్లో అప్రమత్తం

అయితే.. ఆ దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడు? ఈ కాల్పుల వెనుక ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రవాద చర్య కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ, ఏటీఎఫ్‌ బృందాలు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని.. ఘటనపై పూర్తి వివరాలను ఆరా తీస్తున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై లూయిస్‌విల్‌ మేయర్‌ క్రెయిగ్‌ గ్రీన్‌బెర్గ్‌ స్పందిస్తూ.. తదుపరి నోటీసులు వచ్చేదాకా పరిసర ప్రాంత ప్రజలు సంఘటన స్థలం సమీపంలోకి రావొద్దని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని.. లూయిస్‌విల్‌ గవర్నర్‌ అండే బెస్‌హియర్‌ అంజలి ఘటించారు.

సెక్స్ కు ముందు వీటిని తింటున్నారా.. అయితే నీరుకారిపోవడమే

కాగా.. అమెరికాలో ఈమధ్య కాల్పుల ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే మార్చి 28వ తేదీ వరకు 131 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయంటే, పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు 2014లో 273 కాల్పుల ఘటనలు వెలుగుచూడగా.. 2022 నాటికి అవి 647కు ఎగబాకాయి.