NTV Telugu Site icon

Google Layoff: ఐటీ ఉద్యోగాలు ఊస్ట్.. 12,000 మందిని తొలగించనున్న గూగుల్

Google

Google

Google Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

తాజాగా గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ కూడా ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ శుక్రవారం ఓ మెమోలో తెలిపారు. మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతి రోజే గూగుల్ 12,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం గూగుల్ వర్క్ ఫోర్స్ లో ఇది 6 శాతం.

Read Also: A story of survival: సముద్రంలో తప్పిపోయి నరకయాతన.. ప్రాణాలు కాపాడిన కెచప్, వెల్లుల్లి పొడి

ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీపై ప్రభావం చూపుతుందని.. సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ నిర్ణయాలకు పూర్తిగా బాధ్యత వహిస్తానని వెల్లడించారు. తొలగింపులు రిక్రూటింగ్, కొన్ని కార్పొరేట్ విధులు, ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్స్ సహా కంపెనీలోని వివిధ విభాగాలపై ప్రభావం పడనుంది. ప్రపంచవ్యాప్తంగా తొలగింపులు ఉన్నప్పటికీ ముందుగా అమెరికాలోని ఉద్యోగులు ప్రభావితం కానున్నాయి. ముందు ఉన్న గొప్ప అవకాశాలు, మా పోడక్ట్స్, సర్వీస్ పై, మా మిషన్ పై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో పెట్టుబడులపై పూర్తి నమ్మకంతో ఉన్నానని.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ నోట్ లో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు వస్తున్న తరుణంలో టెక్ కంపెనీల లాభాలు తగ్గాయి. దీంతో ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం మంది అంటే 3700 మంది ఉద్యోగులును, అమెజాన్ ఏకంగా 18,000 మంది ఉద్యోగులను, మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను, మెటా 11,000 మందిని తొలగించింది. రానున్న కాలంలో ఐటీ పరిశ్రమ ఇబ్బందికర కాలాన్ని ఎదుర్కోబోతున్నట్లు ఈ పరిణామాలను చూస్తే తెలుస్తోంది.

Show comments