NTV Telugu Site icon

Google: భార్యాభర్తలకు షాకిచ్చిన గూగుల్.. ఒకేసారి ఇద్దరికి లేఆఫ్

Google Fired Couple

Google Fired Couple

Google Fired A Married Couple With 4 Month Old Baby: ప్రైవేట్ కంపెనీలు ఈమధ్య ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే! తమ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా.. ఆ కంపెనీలు క్రమంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. దీంతో.. ఐటీ రంగంలోని ఉద్యోగులు ఎక్కడ తమకు లేఆఫ్ వార్త వినాల్సి వస్తుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సింపుల్‌గా ఒక మెయిల్ పంపంచి, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని కంపెనీలు బాంబులు పేల్చుతున్నాయి. చివరికి ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ సైతం లైఆఫ్ బాట పట్టింది. తమ ఉద్యోగుల్ని తొలగించే పనిలో నిమగ్నమైంది.

At Home At RajBhavan: ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు

ఇప్పుడు తాజాగా ఒకేసారి భార్యాభర్తలిద్దరినీ గూగుల్ తొలగించినట్టు సమాచారం. వాళ్ల పేర్లు అలీ(Allie), స్టీవ్ బీగన్. అలీ నాలుగు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనివ్వగా.. ప్రస్తుతం ఆమె మెటర్నిటీ లీవ్‌లో ఉంది. ఈమె గత ఆరు సంవత్సరాల నుంచి గూగుల్ సంస్థలో పని చేస్తుంది. స్టీవ్ నాలుగు సంవత్సరాల నుంచి గూగుల్‌లో పని చేస్తున్నాడు. అయితే.. సంస్థ నుంచి ఆ ఇద్దరికి ఒకేసారి లేఆఫ్ సందేశం వచ్చింది. అది చూసి వాళ్లు ఖంగుతిన్నారు. తమ బిడ్డ కోసం మరికొంత కాలం సెలవులు పెట్టాలని ఆ జంట భావిస్తే.. రివర్స్‌లో సంస్థే వారికి షాకిచ్చింది. ఇకపై రావాల్సిన అవసరం లేదంటూ.. ఉద్యోగంలో నుంచి గూగుల్ తీసేసింది. ఈ దెబ్బతో వాళ్లకు ఏం చేయాలో పాలుపోవట్లేదు.

Siddharth: హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్ళికి ముందే మరీ ఇంతలానా

కాగా.. అంతర్జాతీయంగా 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాలని గూగుల్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19 సమయంలో అప్పటి అవసరాలకు తగ్గట్టు అధిక నియామకాలు చేపట్టామని.. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల్ని తీసివేయాల్సి వస్తోందని సంస్థ పేర్కొంది. ఈ లేఆఫ్స్‌పై సీఈఓ సుందర్‌ పిచాయ్‌ స్పందిస్తూ.. కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో స్పష్టమైన, ముందస్తుగా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే.. సమస్య మరింత పెద్దదై పరిస్థితి చాలా దారుణంగా మారి ఉండేది వివరించారు.