Site icon NTV Telugu

global Condom Market: అవి తెగవాడేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

Global Condom Market

Global Condom Market

global Condom Market: ప్రపంచవ్యాప్తంగా కండోమ్‌ వినియోగం పెరుగుతున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రజల్లో లైంగిక వ్యాధుల పట్ల పెరుగుతున్న అవగాహన, ఇ- కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి కారణంగా కండోమ్‌ వాడకం పెరిగినట్లు ఆ నివేదికలో పేర్కొంది. 2025 నాటికల్లా అంతర్జాతీయంగా కండోమ్‌ మార్కెట్‌ విలువ 370కోట్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. చైనా, భారత్, జపాన్‌ దేశాలు కీలక మార్కెట్లుగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల సృష్టికర్తలెవరో తెలుసా..?

పెరుగుతున్న డిమాండ్ కారణంగా అంతర్జాతీయంగా కండోమ్ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తున్నట్లు పేర్కొంది. వార్షిక వృద్ధిరేటు 8 శాతంగా ఉంటుందని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచే 44శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. ప్రజల్లో లైంగిక అంటువ్యాధుల పట్ల అవగాహన పెరగడమే కండోమ్‌ వాడకం పెరుగుదలకు కారణమని టెక్‌నావియో నివేదిక పేర్కొంది. లైంగిక అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటం మార్కెట్ విస్తరణకు కారణమని పేర్కొంది. ఇ-కామర్స్ వేదికలు అభివృద్ధి చెందుతుండటం కూడా కండోమ్ మార్కెట్ పెరుగుదలకు కారణమని అభిప్రాయపడింది. మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వేగవంతమైన సరఫరా, మాస్ కస్టమైజేషన్, పర్సనలైజేషన్‌ వంటి వ్యూహాలపై కండోమ్ తయారీ సంస్థలు దృష్టి సారించాలని సూచించింది. వినియోగదారులు గోప్యతతో షాపింగ్ చేయడం కోసం కండోమ్ ప్రొవైడర్లు ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కండోమ్‌ల అనుకూలీకరణ, అలాగే వాటి ప్యాకేజింగ్‌పై పెరుగుతున్న దృష్టి కారణంగా మార్కెట్ పెరుగుతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

Exit mobile version